Home జాతీయ వార్తలు కుప్పకూలిన హోటల్ భవనం : 10 మంది మృతి

కుప్పకూలిన హోటల్ భవనం : 10 మంది మృతి

Bulding-colesed

ఇండోర్:  మధ్యప్రదేశ్ లోని ఇండోర్ లో శనివారం రాత్రి 50 ఏళ్ళ హోటల్ భవనం కుప్పకూలింది. ఈఘటనలో ఇప్పటి వరకు మహిళలతో సహా మొత్తం 10 మంది చనిపోయినట్టు సమాచారం. శిథిలాల్లో మరో 50మంది చిక్కుకొని ఉండవచ్చని రెస్య్కూటీమ్ అనుమానం వ్యక్తం చేసింది.  నిత్యం రద్దీగా ఉండే ఈ రోడ్డు సర్వాతే బస్ స్టాండ్ సమీపంలో రాత్రి 9:17 గంటల సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ హోటల్లో మొత్తం 25 గదులున్నాయి. ఈ ఘటన జరిగిన వెంటనే సహాయక బృందాలు అక్కడికి చేరుకొని చర్యలు చేపట్టాయి. సమాచారం అందుకున్న తక్షణమే సీనియర్ అధికారులు, నగర మేయర్ మాలిని గౌర్, బిజెపి ఎమ్మెల్యే ఉషా ఠాకూర్, డివిజినల్ కమిషనర్, డిఐజి, మున్సిపల్ కమిషనర్ మనీష్ సింగ్ ఘటాన స్థిలికి చేరుకుని సహాయక కార్యక్రమాలను పర్యవేక్షించారు.