Search
Wednesday 14 November 2018
  • :
  • :
Latest News

కస్టమర్‌పై హోటల్ యజమాని దాడి

Injured-Man

హైదరాబాద్: పోలీస్ స్టేషన్‌లో పోలీసులపై హోటల్ నిర్వహకులు వీరంగం సృష్టించారు. బిర్యానీని ప్లాస్టిక్ బియ్యంతో తయారు చేశారని అడిగినందుకు కస్టమర్‌పై హోటల్ యజమాని దాడి చేశాడు. సరూర్‌నగర్ లో మోడల్ రైతు చికెన్ సెంటర్ నిర్వాహకులు దాడికి పాల్పడ్డారు. హోటల్ యజమాని గుండాలతో కలిసి కస్టమర్ ఇంద్రసేన్‌ను చితక్కొట్టారు. పోలీసులు హోటల్ యజమాని, కస్టమర్ ను అదుపులోకి తీసుకున్నారు. సరూర్‌నగర్ టిఆర్‌ఎస్ కార్పొరేటర్ అనుచరులే ఈ దాదాగిరి చేశారని స్థానికులు ఆరోపణలు చేశారు. పోలీసుల వాహనంలో కూడా మరోసారి కస్టమర్‌పై దాడి చేశారు.

Comments

comments