Home జగిత్యాల ఏడుగురు బాల కార్మికులు

ఏడుగురు బాల కార్మికులు

Hotels and child laborers at grocery store caught in work
రాయికల్‌: హోటళ్లు, కిరాణ దుకాణాల్లో పని చేస్తున్న 18 ఏళ్లలోపు బాల కార్మికులను ముస్కాన్ టీం సభ్యులు పట్టుకున్న సంఘటన రాయికల్ మండల కేంద్రంలో సోమవారం జరిగింది. రాయికల్ పట్టణంలోని పలు దుకాణాలు, హోటళ్లను జగిత్యాల ఎస్‌ఐ రామ్, కోరుట్ల ఎస్‌ఐ మధుకర్‌లు తనీఖీ చేయగా ఏడుగురు బాల కార్మిక పిల్లలు పట్టుబడ్డారు. ఈ బాల కార్మికులను సిడబ్లుసి కోర్టుకు హజరు పరిచి పిల్లలకు కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతుందని వారు చెప్పారు. బాలలతో పని చేయించడం నేరమని, యజమానులపై కేసులు తప్పవని హెచ్చరించారు.