Home తాజా వార్తలు గృహ నిర్బంధంలో వరవరరావు

గృహ నిర్బంధంలో వరవరరావు

Varaara Rao in house arrest

మన తెలంగాణ/హైదరాబాద్: సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు విరసం నేత వరవరరావును పోలీసులు పుణె నుంచి హైదరాబాద్‌కు గురువారం ఉదయం తీసుకువచ్చారు.  విమానంలో శంషాబాద్ చేరుకున్న పుణె పోలీసులు అక్కడి నుంచి భారీ బందోబస్తు నడుమ వరవరరావును ఆయ న ఇంటికి చేర్చారు. అయితే మీడియా ప్రతినిధులతో మాట్లాడేందుకు ఆయన నికారించారు. సుప్రీం కోర్టు ఆదేశాలకు లోబడి ఉండాలని ఆయన స్పష్టం చేశా రు.సెప్టెంబర్‌ఱ 6 వరకు గృహనిర్భంధంలో ఉంచనున్నారు. ప్రధాని హత్యకు కుట్ర రచన, మావ్యోస్టులతో సంబంధాలు ఉన్నాయన్న ఆరోపణలపై మంగళవారం పుణె పోలీసులు హైదరాబాద్‌లో వరవరరావును అరెస్టు చేశారు. అదే రోజు ఢిల్లీ, ముం బాయి, గోవా, జార్ఖండ్‌లలో దాడులు చేసి మరో ఐదుగురు పౌర నేతలను అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఈ అరెస్టులను నిరసిస్తూ పలువురు న్యాయవాదులు సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై స్పందించిన కోర్టు ‘జైలుకు అవసరం లేదని, గృహ నిర్భందం చాలు’ అంటూ ఆదేశించింది. దీంతో పుణె పోలీసులు వరవరరావును క్షేమంగా ఇంటి దగ్గర వదిలి వెళ్లారు. వరవరరావు ఇంటి వద్ద హైదరాబాద్ పోలీసులు బందోబస్తుగా ఉన్నారు. వరవరరావు ఇంట్లో నుంచి బయటికి వెళ్లకుండా ఆయన్ని బయటి వ్యక్తులు ఎవరు కలువకుండా కోర్టు ఆదేశాలను పాటిస్తున్నామని పోలీసులు చెప్పారు. వరవరరావు తిరిగి ఇంటికి చేరుకోవడంతో కుటుంబ సభ్యులు ఆనందోత్సావాల్లో మునిగిపోయారు. న్యాయం ఎప్పుడైనా ప్రజాస్వామ్యం వైపు నిలుస్తుందనడానికి  సుప్రీం కోర్టు ఆదేశాలే నిదర్శనమని కుటుంబ సభ్యులు అభిప్రాయపడ్డారు.