Home తాజా వార్తలు మీకో ఇంటి ప్లాన్

మీకో ఇంటి ప్లాన్

West Independent House _manatelanganaఇక్కడ కనిపిస్తున్నది వెస్ట్ ఫేసింగ్ ఇండిపెండెంట్ ప్లాన్. ప్రధాన గేటు ముందు కారు పార్కింగ్ కోసం స్థలం ఏర్పాటు చేశారు. ప్రధాన ద్వారం గుండా ఇంట్లోకి ప్రవేశించగానే డ్రాయింగ్ రూమ్ కనిపిస్తుంది. దాని పక్కనే డైనింగ్ హాల్‌ను ప్లానులో ఏర్పాటు చేశారు. డైనింగ్ రూమ్‌కు కుడివైపు ఒక బెడ్‌రూమ్‌ను ఏర్పాటు చేశారు. దీనికి అటాచ్‌గా బాత్‌రూమ్ ఏర్పాటు ఉంది. డైనింగ్ రూమ్ ఎడమ పక్కన బెడ్‌రూమ్‌ను ప్లానులో ఏర్పాటు చేశారు. దానిపక్కనే కిచెన్ రూమ్‌ను ఏర్పాటు చేశారు. దానికి ఆనుకునే కామన్ బాత్‌రూమ్‌ను ఏర్పాటు చేశారు. గాలి, వెలుతురు ధారాళంగా వచ్చే విధంగా ఇంటి ప్లాన్‌ను సెట్ చేశారు. అందుకు తగ్గట్టుగా కిటికీలను ఏర్పాటు చేశారు. చుట్టూ కాంపోండ్ వాల్‌తో పాటు కారు పార్కింగ్ ఎడమ పక్కన, లాన్‌లో పిల్లలు ఆడుకోవటానికి తగినంత స్థలం ప్లాన్‌లో చూడవచ్చు. అదే విధంగా డాబాపైకి వెళ్ళటానికి మెట్ల ఏర్పాటు కూడా ఉంది. చూడ చక్కని ప్లాన్ బాగుంది కదూ !