Search
Thursday 15 November 2018
  • :
  • :
Latest News

పేదలందరికి ఆవాసం కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం : ఇంద్రకరణ్‌రెడ్డి

Indra-Karan-Reddyఅదిలాబాద్ : రాష్ట్రంలోని ప్రతీ పేదవాడికి ఆవాసం కల్పించి అందరికీ సొంతింటి కలను సాకారం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర గృహ నిర్మాణ, న్యాయ, దేవాదాయ శాఖా మంత్రి ఇంద్ర కరణ్ రెడ్డి అన్నారు. డబుల్ బెడ్ రూం పథకం అములులో భాగంగా ఇప్పటికే 60 వేల ఇళ్లు మంజూరు చేయడం జరిగిందన్నారు. దశల వారీగా అన్ని వర్గాల నిరుపేదలకు ఈ పథకాన్ని వర్తింప చేసేందకు ముఖ్యమంత్రి కెసిఆర్ నిర్ణయం తీసుకున్నారన్నారు. గతంలో ఏ ప్రభుత్వాలు చేయని విధంగా టిఆర్‌ఎస్ ప్రభుత్వం డబుల్ బెడ్‌రూం గృహాలను మంజూరు చేయడం జరిగిందన్నారు. తన నియోజకవర్గంలో నెలకొన్న సమస్యలన్నింటిని పరిష్కరిస్తానన్నారు. ప్రభుత్వం ప్రవేశ పెట్టిన మిషన్‌కాకతీయ, మిషన్ భగీరధ, కళ్యాణలక్షీ, షాదిముబారక్ తదితర పథకాలను విజయవంతం చేసేందుకు కృషి చేస్తానన్నారు. ఈ ఏడాది జరుగునున్న సమ్మక్కసారక్క, కృష్ణ పుష్కరాలను అత్యంత వైభవంగా నిర్వహించి తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలు లోకానికి చాటి చెప్పనున్నామన్నారు. జిల్లాలో సాగునీరుకు యోగ్యమైన భూములను గుర్తించి వాటికి సాగునీరందించేందకు వివిధ కొత్త చెరువులు, ఎత్తిపోతల పధకాలను మంజూరు చేస్తామన్నారు.

Comments

comments