Home పెద్దపల్లి జర్నలిస్టులకు స్థలాలు ఇచ్చి ఇండ్లు కట్టిస్తాం

జర్నలిస్టులకు స్థలాలు ఇచ్చి ఇండ్లు కట్టిస్తాం

Mp

పెద్దపల్లి టౌన్ : పెద్దపల్లి పార్ల మెంట్ పరిధిలో ఉన్న జర్నలిస్టులందరికి  స్థలాలు అందజేసి ఇండ్లు కట్టిస్తామని పెద్దపల్లి ఎంపి బాల్క సుమన్ అన్నారు. పెద్దపల్లిలో అదివారం పెద్దపల్లి ప్రెస్ క్లబ్ ప్రారం భించిన సందర్భంగా అయన మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమ సమయంలో చేసిన పోరాటాలను చేసిన త్యాగాలను ఎత్తి పడుతూ రాసిన వార్తల వలన నేడు తెలంగాణ సాధించుకొని  ఈ స్థాయిలో ఉన్నమని అన్నారు. జర్నలిస్టుల జీవితాలు జీతాలు లేని బతుకులని దుర్బరా జీవిస్తున్న జర్నలిస్టులు ఎందరో ఉన్నారని చాలీ చాలని జీవితాన్ని ఎల్లదీస్తున్నారని అన్నారు.

తెలంగాణ ప్రభుత్వం  జర్నలిస్టులకు అన్ని విధాల సమకుర్చుతుందన్నారు. తెలంగాణలో ప్రజలకు అన్ని విధాల అభివృద్ధి చేసి తీరుతామని అందుకు జర్నలిస్టులు ప్రజల పక్షాన ప్రభుత్వం పక్షాన నిలబడి నిజాలు అందించి అభివృద్ధిలో భాగస్వామలు కావాలని కోరారు. ఎమ్మెల్సీ భాను ప్రసాద్ రావు మాట్లాడుతూ దేశంలో జర్నలిస్టుల ఎంతో గొప్పవారని రాస్తున్న రాతలో సమాజ నిర్మాణ జరుగుతుందని ప్రజల వైపు నుండి ప్రభుత్వంకు తెలియ చెప్పే వాళ్ళే జర్నలిస్టులని అన్నారు. ఈద శంకర్ రెడ్డి మాట్లాడుతూ ప్రజలకు నాయకులకు మంచి జరుగలన్న చెడు జరుగలన్న జర్నలిస్టులు పాత్ర ఎంతో ఉంటుందని అన్నారు.