Home రాష్ట్ర వార్తలు ఉద్యోగులకు  ఇళ్లు, స్థలాలు

ఉద్యోగులకు  ఇళ్లు, స్థలాలు

telanganaమంత్రి కెటిఆర్ హామీ

 హైదరాబాద్ : తమ ప్రభుత్వం ఉద్యోగులను స్నేహ భావంతో చూస్తుందని, ఇలాంటి సుహృద్భావ వాతావరణం దేశంలోని మరే రాష్ట్రంలో కూడా లేదని ఐటి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి కె.టి.రామారావు చెప్పారు. ఉద్యోగుల న్యాయమైన డిమాండ్స్ అన్నింటిని సానుకూలంగా పరిష్కరిస్తామని, రాజీవ్ గృహకల్ప పథకం కింద నిర్మించిన వాటిని పంపిణీ చేయడంతో పాటు మిగతా వారికి ఇళ్ల స్థలాలు కేటాయిస్తామని హామీనిచ్చారు. తెలంగాణ నాన్-గెజిటెడ్ ఆఫీసర్స్ యూనియన్ (టిఎన్‌జివో) ఆధ్వర్యంలో రవీంద్రభారతిలో బుధవారం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ఉద్యోగుల సదస్సు జరిగింది. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన కెటిఆర్ మాట్లాడుతూ, తెలం గాణ ఉద్యమంలో ఉద్యోగులు పోషించిన పాత్రను ఎవరూ మర్చిపోలేర న్నారు. ఉద్యమంలో మాదిరిగానే ఇప్పుడు కూడా మనమందరం కలిసి పనిచేస్తూ, రాష్ట్రాన్ని బంగారుమయంగా తీర్చిదిద్దుదామన్నారు. ఉద్యోగు లంతా సంతృప్తి చెందే రీతిలో 43 శాతం ఫిట్‌మెంట్ ఇచ్చిన విషయాన్ని గుర్తు చేస్తూ, ఇందుకు సంబంధించిన బకాయిలను త్వరలోనే విడుదల చేస్తామని హామీనిచ్చారు. ఆదాయపు పన్ను పరిమితిని రూ. 5 లక్షలకు పెంచమని ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీని కలిసి న్యాయం చేయమని కోరుదా మన్నారు. తమ సమస్యలు పరిష్కరించాలంటూ కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు నినాదాలు చేయగా, తప్పక న్యాయం చేస్తామని, అధైర్యపడ వద్దని, ముఖ్యమంత్రి కెసిఆర్ గతంలో ఇచ్చిన హామీని గుర్తు చేశారు. ఆం ధ్ర, తెలంగాణ ప్రాంతాల ప్రజలు, నాయకుల మధ్య గతంలో మాదిరిగా భావోద్వేగాలు లేవని, వాతావరణం చల్లబడినందున ఉద్యోగుల విభజన, కేటాయింపుల విషయంలో చర్చల ద్వారా పరిష్కరించుకుందామన్నారు. విభజన చట్టం ప్రకారం శాసనసభ నియోజకవర్గాల సంఖ్య పెరుగనుం దని, పరిపాలనా వికేంద్రీకరణలో భాగంగా కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజ న్స్, మండలాలను ఏర్పాటు చేయనున్నట్లు వివరించారు. హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి మాట్లాడుతూ, ముఖ్యమంత్రి కెసిఆర్ ఉద్యోగులను బాగా ప్రేమిస్తారని, మీరు కూడా ఆయన పట్ల గౌరవాభిమానులు చూపిస్తు న్నారన్నారు. తెలంగాణకు చెందిన ఉద్యోగులందరూ ఈ రాష్ట్రంలోనే కొన సాగే విధంగా తప్పక చర్యలు తీసుకుంటామని, ఈ విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. సదస్సులో టిఎన్‌జివో గౌరవాధ్యక్షులు జి.దేవీప్రసాద్‌రావు మాట్లాడుతూ, ఉద్యోగుల న్యాయమైన డిమాండ్స్ పట్ల ముఖ్యమంత్రికి సంపూర్ణ అవగాహన ఉందన్నారు. దేశంలోని ఏ ఇతర రాష్ట్రాలలో లేనివిధంగా ప్రభుత్వం ఉద్యోగులకు స్నేహ హస్తం అందించిం దన్నారు. చెన్నై వరద బాధితులు, కరువు మండలాల రైతులను ఆదుకునేం దుకు తమ ఒక రోజు వేతనం ముఖ్యమంత్రి సహాయనిధికి త్వరలో అంద జేస్తామని ప్రకటించారు. యూనియన్ అధ్యక్షులు కారం రవీందర్‌రెడ్డి మాట్లాడుతూ, కెసిఆర్ తమ సమస్యలను సానుకూలంగా పరిష్కరిస్తారన్న సంపూర్ణ విశ్వాసం ఉందన్నారు. సదస్సులో ఎంఎల్‌ఎ గువ్వల బాలరాజు, టిఎన్‌జివో నాయకులు ఎం.ఎ.హమీద్, తదితరులు పాల్గొన్నారు.