Search
Friday 21 September 2018
  • :
  • :

ఆ పేరెలా వచ్చిందంటే

హైదరాబాద్‌లో చాలా ప్రాంతాల పేర్లు దాదాపు అందరికీ తెలిసినవే. అసలు ఆ ప్రాంతానికి ఆపేరెలా వచ్చిందనే విషయం కొద్దిమందికి మాత్రమే తెలిసి ఉండవచ్చు. అవేంటో మళ్లీ ఒకసారి గుర్తుచేసుకుందాం..

hyd-Image

అమీర్‌పేట్: ఒకప్పుడు నిజాం పరిపాలనలో అధికారులుగా పనిచేసిన జాగీర్దార్లు ఇక్కడ నివసించేవారు. అమీర్ అంటే సంపన్నులని అర్థం. అప్పట్లో ఈ ప్రాంతంలో డబ్బున్నవారు ఎక్కువగా ఉండేవారు అందుకే ఈ ప్రాంతానికి అమీర్ పేట్ అని పేరు వచ్చింది.

సోమాజీగూడ : సోమాజీ అనే నిజాం కలాం రెవిన్యూ విభాగంలో వుండేవాడు. హైదరాబాద్ ప్రాంతపు గూడెంలో నివసించేవాడు. ఆయన పేరుతో ఆ గూడెం కాస్తా సోమాజిగూడగా మారింది.

ఇఎస్‌ఐ : ఈ ప్రాంతంలో ఇఎస్‌ఐ ఆస్పత్రి ఉండటం వల్ల ఈ ఏరియాకి ఇఎస్‌ఐ అనే పేరు వచ్చింది.
గన్ ఫౌండరీ: నిజాం నవాబులు యుద్ధంలో వుపయోగించే ఫిరంగిలో వాడే మందు పౌడర్‌ను ఇక్కడ తయారుచేసేవారు.ఈ ప్రాంతాన్ని తోప్గా, సాబ్జాగా పిలిచేవారు. కాలక్రమేణ ఇది గన్ ఫౌండరీగా మారింది.

సుల్తాన్ బజార్: 1933లో రెసిడెన్సీ బజార్ పేరుతో కొనసాగుతున్న ఆసియాలోనే అతిపెద్ద బజార్ సుల్తాన్ బజార్ గా మారింది.
కోటి : 1598 నుంచి 1805 కాలంలో అప్పటి బ్రిటీష్ రెసిడెంట్ ఆఫీసర్ జే.ఎస్.అఖిలన్ నివాసంగా ఇక్కడ పెద్దభవనం కట్టారు. కోటి అంటే ప్రాసాదం. అందుకే ఈ ప్రాంతానికి కోటి అనే పేరు వచ్చింది.

అబిడ్స్ : ఈ ప్రదేశంలో అబీదు అనే ఒక మధ్యప్రాచ్య వ్యాపారవేత్త వుండేవాడు. అరుదైన విలువైన రాళ్ళను కోటీలో వున్న నవాబులకి బహుమతులుగా ఇచ్చేవాడు. అందుకే ఈ ప్రదేశానికి ఆ పేరు వచ్చింది.

దోమల్‌గూడా : ఇద్దరు మల్లయోధులు నివాసం వుండటం వల్ల దీనికి ఈ పేరు వచ్చింది. నిజానికి ఇది దోమల్ గూడా కాదు. ’దో’ మల్ గూడా. ఈ ప్రాంతంలో రామకృష్ణ మఠం కూడా వుంది.

లఖడీకాపూల్ : కర్రతో చేసిన వంతెన అని అర్థం. నగరానికి నడిబొడ్డు ఈ ప్రాంతం.

ఎస్.ఆర్. నగర్ : ఐ.పి.యస్ అధికారి ఉమేష్ చంద్ర నక్సలైట్ల చేతిలో ప్రాణాలను కోల్పోయింది ఈ కూడలిలోనే. అందుకే ఎస్.ఆర్.నగర్ కూడలిలో అతని జ్ఞాపకార్థం విగ్రహం స్థాపించారు.

Comments

comments