Search
Friday 21 September 2018
  • :
  • :
Latest News

పెర్‌ఫ్యూమ్ ఎలా ఎంచుకోవాలంటే..

perfume2

ప్రస్తుతం యువత ఫాలో అవుతున్న ఫ్యాషన్‌లో పెర్‌ఫ్యూమ్ ఒకటి. దీన్ని వేసుకోవడమే కాదు… ఎంచుకోవడం కూడా ఒక నైపుణ్యమే. మనసు దోచే పెర్‌ఫ్యూమ్స్ అందరికీ నిత్య అవసర వస్తువైపోయింది. దీన్ని ఎంచుకండంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు గురించి తెలుసుకుందాం..!
* పెర్‌ఫ్యూమ్స్‌ను కూడా సీజన్ బట్టి మార్చాలి. వేసవికాలంలో చర్మం తేమగా ఉంటుంది. కాబట్టి వేసవిలో తక్కువ గాఢత ఉండే పెర్‌ఫ్యూమ్, చలికాలంలో ఎక్కువ గాఢత ఉండే దాన్ని ఎంచుకుంటే మంచిది.
* కొనే ముందు పెర్‌ఫ్యూమ్‌ను ఒకసారి ట్రై చేసి తీసుకోవాలి. ఇలా ట్రై చేయడం ద్వారా కొన్ని విషయాలు తెలుస్తాయి. అది మీ చేతులపై స్ప్రే చేసుకొని దాని వాసన చూడండి. శరీరం నుంచి వెలువడే సహజ నూనెలతో పెర్‌ఫ్యూమ్ కలిస్తే దాన్ని వాసన మారకపోతే అది మంచిదని భావించవచ్చు.
* పెర్‌ఫ్యూమ్ స్ప్రే చేసుకోవడం అనేది రోజూవారీ ప్రణాళికలో భాగమైపోయింది. అందుకనే ఎక్కువ సమయం సువాసన వెదజల్లే పెర్‌ఫ్యూమ్‌ను ఎంచుకోవడం చాలా ముఖ్యం.
* మీరు ఎంచుకునే పెర్‌ఫ్యూమ్ మనసుకి ఎంత ఉల్లాసాన్ని కలిగిస్తుందో.. అలానే మీ శరీరతత్వానికి దగ్గరగా ఉండేలా చూసుకోవాలి. ఇలాంటి పెర్‌ఫ్యూమ్‌ను ఎంచుకోవడం వల్ల ఎక్కువ సయమం సువాసన వెదజల్లుతుంది. అలాగే రోజు మొత్తం మీ శరీరం నుంచి ఎలాంటి చెమట వాసన రాకుండా కాపాడుతుంది.
* ఎక్కువ వాసన వచ్చే పెర్‌ఫ్యూమ్ వల్ల ఇతరులకు ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది. కాబట్టి అలాంటి విషయాలని దృష్టిలో పెట్టుకొని పెర్‌ఫ్యూమ్‌ను ఎంచుకోవాలి.
* స్నానం చేసిన తరువాత శరీరం తేమగా ఉన్నప్పుడే పెర్‌ఫ్యూమ్ స్ప్రే చేసుకుంటే దాని వాసనను శరీరం బాగా పీల్చుకుంటుంది. మనం స్నానానికి ఉపయోగించే సబ్బు వాసన.. పెర్‌ఫ్యూమ్ వాసన కంటే తక్కువగా ఉండాలి. అప్పుడే పెర్‌ఫ్యూమ్ ఎక్కువ సువాసనలు వెదజల్లుతుంది. అలాగే శరీరానికి రాసుకునే మాయిశ్చరైజర్ వంటివి కూడా ఎలాంటి వాసన లేకుండా ఉన్నవైతే మంచిది.
* మంచి పెర్‌ఫ్యూమ్‌ను ఎంచుకోవడమే కాదు… దాన్ని జాగ్రత్తగా భద్రపరచడమూ అంతే ముఖ్యం. దానిపై నేరుగా సూర్యరశ్మి పడితే దాని వాసన మారుతుంది. కాబట్టి పెర్‌ఫ్యూమ్‌పొడిగా, చల్లగా ఉండే ప్రదేశంలో ఉంచాలి. ఇలా చేస్తే అది సువాసనను కోల్పోకుండా ఉంటుంది.

Comments

comments