Search
Tuesday 20 November 2018
  • :
  • :
Latest News

డార్క్ స్పాట్స్ తగ్గేదెలా?

lf

వేసవి కాలంలో  మిగతా కాలాలలో కన్నా ఎక్కువగా యూవీ కిరణాలు చర్మానికి తగిలి చర్మం అలర్జీకి, ఇంకా చర్మం మీద డార్క్ స్పాట్స్ రావడానికి కూడా అవకాశం ఎక్కువ. చర్మం ఎక్కువగా హైపర్ పెగ్మెంటేషన్‌కి గురవుతుంది. చర్మాన్ని మనకు సహజంగా దొరికే మొక్కల నుండి, ఇంకా వంటింట్లో దొరికే పదార్థాల నుండి కాపాడుకోవచ్చు. వీటిలో పసుపు, అలోవెరా, పాలు, గంధం ఉపయోగించి చర్మాన్ని కాంతివంతంగా చేసుకోవచ్చు. 

పసుపు : పసుపు బలమైన యాంటీ బ్యాక్టీరియల్ , యాన్టీ-ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు కలిగిన మరొక సహజ పదార్థం. యాంటీ టర్మరిక్ క్రీంలాంటివి. సేంద్రీయ ఆధారిత ఫేస్ క్రీంలని బయట మనకు దొరుకుతాయి. వాటిని ఉపయోగించి హైపర్ పిగ్మెంటేషన్ నుండి చర్మాన్ని రక్షించుకోవచ్చు.
అలోవిరా: ప్రతిరోజూ కనీసం కలబంద గుజ్జుని ముఖానికి రాస్తే సూర్య కిరణాలనుండి వేడిని తగ్గిస్తుంది. ముఖం మీద ఉన్న మృతకణాలు తొలగిపోయి ప్రకాశవంతంగా కూడా మారుతుంది.
పాలు: సహజ చర్మ క్లెన్సర్, టోనర్‌గా పాలను ఉపయోగించవచ్చు. ఎందుకంటే పచ్చి పాలలో మెలనిన్ ఉత్పత్తిని తగ్గించే, చర్మ దురద నుండి ఉపశమనాన్ని ఇస్తుంది. డార్క్ ప్యాచెస్‌ను తగ్గించే గుణం ఈ పాలలో పుష్కలంగా ఉంది.
గంధం : గంధం కూడా చర్మం మీద యూవీ రేడియేషన్లకు వ్యతిరేకంగా నిరోధాన్ని ఏర్పరిచే సామర్థం కలిగి ఉంది. ఇది శక్తివంతమైన యాన్టీ-ఇన్‌ఫ్లమేటరీ గుణాలు మెండుగా ఉన్నాయి.
బాదం : బాదం నూనెలో దూది ఉండను ముంచి చేతులు, ముఖం, కళ్లకింద, గొంతు మీద మృదువుగా మసాజ్ చేయాలి. అరగంట తరువాత గోరువెచ్చని నీటితో స్నానం చేయాలి.
శనగపిండి తేనె : ఈ రెండు కలిపి ముఖానికి, చేతులకు రాసి 20 నిమిషాల తర్వాత చల్లని నీటితో శుభ్ర పరుచుకోవాలి. ముఖం మీద ఉన్న డార్క్ స్పాట్స్ తగ్గుముఖం పడతాయి.

Comments

comments