Search
Monday 19 November 2018
  • :
  • :
Latest News

మరకలను పోగొట్టండిలా…

Cleaningకొత్త బట్టలపై మరకలు పడినప్పుడు ఆ బాధ వర్ణణాతీతం. ఎందుకంటే ఆ మరకలు పోవడానికి రకరకాల సబ్బులు, రసాయనాలతో ప్రయత్నాలు చేస్తుంటాం… కానీ ఆ రసాయనాల వల్ల దుస్తులు చినిగిపోవడం లేదా రంగు మారిపోవడం జరుగుతుంటాయి. కానీ ఈ చిట్కాలు పాటించి చూడండి మీ దుస్తులు మరకలు పోయి మెరుస్తాయి.
* దుస్తులకు గోరింటాకు మరకలంటినప్పుడు… ఆ ప్రదేశాన్ని అరగంటసేపు పాలతో నానపెట్టాలి. తరువాత నిమ్మకాయ ముక్కతో రుద్ది చూస్తే గోరింటాకు మరకలు పోతాయి.
* రుమాళ్లపైన, టవల్స్ మీద పడే లిప్‌స్టిక్ మరకలు పోవాలంటే వాటిపై గ్లిసరిన్ రాసి కొంత సేపు తరువాత సబ్బుతో ఉతకాలి.
* శీకాయపొడితో రుద్దితే జరీ మీద పడిన మరకలు పోతాయి.
* దుస్తుల మీద సిరా మరకలు పోవాలంటే పుల్లటి పెరుగులో కాసేపు నానబెట్టి తరువాత ఉతికితే సరి.
* షిఫాన్ చీరలపై నూనె మరకలు పోవాలంటే టాల్కంపౌడర్ చల్లి మడత పెట్టండి. మరు నాడు పౌడర్ దులిపి ఉతకాలి. అంతే మరక లుపోయి కొత్తవాటిలా తయార వుతాయి.

Comments

comments