Search
Monday 24 September 2018
  • :
  • :
Latest News

ఒయుకు 23వ స్థానం

Osmania-University

దేశంలో ఏడవదిగా హెచ్‌సియు
ఐఐటి హైదరాబాద్‌కు 10వ ర్యాంకు

న్యూఢిల్లీ : కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ దేశంలో ఉన్నత విద్యాసంస్థల ర్యాంకులను సోమవారం విడుదల చేసింది. ఓవరాల్ కేటగిరీలో బెంగ ళూరు ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ప్రథమ స్థానంలో నిలిచింది. మేనేజ్‌మెంట్ విభాగంలో ఐఐఎం అహ్మదాబాద్ ప్రథమస్థానం దక్కిం చుకుంది. విశ్వవిద్యాలయాల విభాగంలోనూ బెంగళూరు ఐఐఎస్‌సి తొలి స్థానం సాధించింది. ఇంజి నీరింగ్ విభాగంలో ఐఐటి మద్రాస్ మొదటి స్థానం దక్కించుకోగా ఐఐటి హైదరాబాద్‌కు పదోస్థానం దక్కింది.

యూనివర్శిటీ విభాగంలో హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయానికి 7వస్థానం, ఉస్మానియా విశ్వవిద్యాలయానికి 23వస్థానంలో నిలిచింది. ఢిల్లీలోని జెఎన్‌యుకు రెండో స్థానం, బనారస్ హిందూ వర్సిటీ మూడో స్థానంలో నిలిచాయి. ఓవరాల్, యూనివర్సిటీ, ఇంజినీరింగ్, మేనేజ్‌మెంట్, ఫార్మసీ ఇలా ఐదు విభాగాల్లో ర్యాంకులను ప్రకటించారు. ప్రభుత్వం నిధుల కేటాయింపులో ఈ ర్యాంకులను ఆధారంగా తీసుకుంటుంది. 2015లో జాతీయ విద్యాసంస్థల ర్యాంకింగ్ వ్యవస్థ ప్రారంభించిన తర్వాత తొలిసారిగా 2016లో ర్యాంకులను ప్రకటించారు. దీనికోసం గతేడాది 3,300 సంస్థలు దరఖాస్తు చేసుకున్నాయి.

టాప్ టెన్ విశ్వవిద్యాలయాలు
1. ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్-బెంగళూరు
2. జవహర్‌లాల్ యూనివర్సిటీ-ఢిల్లీ
3. బనారస్ హిందూ యూనివర్సిటీ
4. జవహర్‌లాల్ నెహ్రు సెంటర్ ఫర్ అడ్వాన్స్‌డ్ సైంటిఫిక్ రీసెర్చ్-ఢిల్లీ
5. జాదవ్‌పూర్ యూనివర్సిటీ-పశ్చిమ బెంగాల్
6. అన్నా యూనివర్సిటీ-చెన్నై
7. యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్-తెలంగాణ
8. యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీ-ఢిల్లీ
9. అమృత విశ్వవిద్యాపీఠం-కోయంబత్తూర్
10. సావిత్రిభాయి ఫూలే పుణె వర్సిటీ-మహారాష్ట్ర

టాప్ టెన్ కాలేజీలు
1. మిరాండ హౌస్-ఢిల్లీ
2. లయోల కాలేజీ-చెన్నై
3. శ్రీరామ్ కాలేజ్ ఆఫ్ కామర్స్-ఢిల్లీ
4. బిషప్ హెబెర్ కాలేజీ-తిరువనంతపురం
5. ఆత్మారాం సనాతన్ ధర్మ కాలేజీ-ఢిల్లీ
6. సెయింట్ జేవియర్ కాలేజీ-కోల్‌కతా
7. లేడీ శ్రీరామ్ కాలేజీ-ఢిల్లీ
8. దయాళ్ సింగ్ కాలేజీ-ఢిల్లీ
9. దీన్‌దయాళ్ ఉపాధ్యాయ కాలేజీ-ఢిల్లీ
10. మహిళల క్రిస్టియన్ కాలేజీ-చెన్నై

Comments

comments