Home టెక్ ట్రెండ్స్ 48 మెగాపిక్స‌ల్ కెమెరాతో విడుదలైన హువావే ‘హానర్ వి20’

48 మెగాపిక్స‌ల్ కెమెరాతో విడుదలైన హువావే ‘హానర్ వి20’

ప్రముఖ మొబైల్స్ తయారుదారు హువావే త‌న నూత‌న స్మార్ట్‌ఫోన్ ‘హానర్ వి20’ని బుధవారం చైనా మార్కెట్‌లో విడుద‌ల చేసింది. ఈ స్మార్ట్‌ఫోన్ లో 25 మెగాపిక్స‌ల్ ఫ్రంట్ కెమెరాతో పాటు వెనుక భాగంలో 48 మెగాపిక్స‌ల్ కెమెరాను అమ‌ర్చారు.  ఇందులో 6.4 ఇంచుల భారీ డిస్‌ప్లేను, 8 జిబి ప‌వ‌ర్‌ఫుల్ ర్యామ్‌ను అమ‌ర్చారు. ఈ స్మార్ట్‌ఫోన్ బ్లాక్‌, బ్లూ, రెడ్ క‌ల‌ర్ వేరియంట్ లో విడుద‌ల చేశారు.

ఈ ఫోన్‌కు చెందిన 6 జిబి ర్యామ్, 128 జిబి స్టోరేజ్ వేరియెంట్‌ను రూ.30,428 ధ‌ర‌కు, 8 జిబి ర్యామ్‌, 128 జిబి స్టోరేజ్ వేరియెంట్‌ను రూ.35,500ధ‌ర‌కు, 8జిబి ర్యామ్‌, 256 జిబి స్టోరేజ్ వేరియెంట్‌ను రూ.40,560 ధ‌రకు విక్ర‌యించ‌నున్నారు. కాగా, ఈ నెల 28 నుంచి ఈ ఫోన్ వినియోగ‌దారుల‌కు అందుబాటులోకి రానుంది.

ఫీచర్స్:

6.4 ఇంచ్ ఫుల్ హెచ్‌డి ప్ల‌స్ ఎల్‌సిడి ఐపిఎస్ డిస్‌ప్లే

1080 x 2310 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజల్యూష‌న్‌

హువావే కైరిన్ 980 ఆక్టాకోర్ ప్రాసెస‌ర్‌

6/8 జిబి ర్యామ్‌, 128/256 జిబి స్టోరేజ్‌

ఆండ్రాయిడ్ 9.0 పై, డ్యుయ‌ల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0 ఎల్ఇ

48 మెగాపిక్స‌ల్ బ్యాక్ కెమెరా, 25 మెగాపిక్స‌ల్ సెల్ఫీ కెమెరా

డ్యుయ‌ల్ 4జి వివోఎల్‌టిఇ, యూఎస్‌బి టైప్ సి, 4000 ఎంఎహెచ్ బ్యాట‌రీ

Huawei Honor V20 Launched in china market