Home తాజా వార్తలు హువావే మేట్ 20 సిరీస్ స్మార్ట్‌ఫోన్లు

హువావే మేట్ 20 సిరీస్ స్మార్ట్‌ఫోన్లు

Huawei Mate 20 series smartphones

ముంబయి: ప్రముఖ ఎలక్ట్రానిక్‌ ఉత్పత్తుల సంస్థ ‘హువావే’ మేట్ 20 సిరీస్‌లో కొత్త స్మార్ట్‌ఫోన్లను మంగళవారం లండన్‌లో రిలీజ్ చేస్తోంది. మేట్ 20, మేట్ 20 ప్రొ, మేట్ 20ఎక్స్ పేరిట ఈ స్మార్ట్ ఫోన్లు రిలీజ్ కానున్నాయి. ఈ  మూడు ఫోన్లలో అధునాతన హై సిలికాన్ కైరిన్ 980 ప్రాసెసర్‌ అందుబాటులో ఉంది. అలాగే ఈ మూడు ఫోన్లలోనూ వెనుక భాగంలో ట్రిపుల్ కెమెరాలను ఏర్పాటు చేశారు. రేపు సాయంత్రం 6.30 గంటలకు ఈవెంట్ ప్రారంభం కాబోతుంది. అందులో ఈ ఫోన్లను లాంచ్ చేస్తామని సంస్థ వెల్లడించింది. మేట్ 20 సిరీస్ స్మార్ట్ ఫోన్ల ధరలు… మేట్ 20 ధర రూ.68వేలకు అందుబాటులో ఉండగా… మేట్ 20 ప్రొ ధర రూ.92వేలుగా ఉంది. మేట్20ఎక్స్ ధర వివరాలు  సంస్థ ఇంకా వెల్లడించలేదు.

మేట్ 20 సిరీస్ స్మార్ట్‌ఫోన్ అద్భుత ఫీచర్లు…

మేట్ 20 స్మార్ట్‌ఫోన్‌లో 6.43 ఇంచుల డిస్‌ప్లే, 4 జిబి ర్యామ్, 128 జిబి స్టోరేజ్, 4000 ఎంఏహెచ్ బ్యాటరీ బ్యాకప్ వంటి అద్భుత ఫీచర్లు ఇందులో ఉండవచ్చని తెలుస్తోంది.

మేట్ 20 ప్రొ స్మార్ట్‌ఫోన్‌ ఫీచర్లు….

అలాగే మేట్ 20 ప్రొ స్మార్ట్‌ఫోన్‌లో 6.39 ఇంచుల డిస్‌ప్లే, 6/8 జిబి ర్యామ్, 128 జిబి0 స్టోరేజ్, ఆండ్రాయిడ్ 9.0, 4200 ఎంఎహెచ్ బ్యాటరీ వంటి అద్భుత ఫీచర్లు ఉన్నాయి. ఇక మేట్20ఎక్స్ ఫీచర్ల వివరాలు ఇంకా వెల్లడించలేదు.

Huawei Mate 20 series smartphones