Home తాజా వార్తలు జలమండలికి ప్రతిష్టాత్మకమైన హాడ్కో అవార్డు

జలమండలికి ప్రతిష్టాత్మకమైన హాడ్కో అవార్డు

మనతెలంగాణ/సిటీబ్యూరో:హైదరాబాద్ మెట్రోపాలిటన్ నీటి సరఫరా మరియు మురుగునీటి పారుదల మండలి(జలమండలి)ని ప్రతిష్టాత్మకమైన హాడ్కో అవార్డు వరించింది. గ్రేటర్ హైదరాబాద్ ప్రజలకు ప్రతిష్టాత్మకంగా తాగునీటిని సరఫరా చేస్తున్న జలమండలి చేపట్టిన నూతన ఆవిష్కరణలకు ఈ అవార్డు దక్కింది.

హాడ్కో 49వ వ్యవస్ధాపక దినోత్సవాన్ని పురస్కరించుకుని విశ్వనగరంలో నివాసయోగ్యమైన సౌకర్యాలను కల్పిస్తున్న జలమండలి సేవలను మెచ్చి హాడ్కో ఈ పురస్కారాన్ని ఇచ్చింది. గురువారం న్యూఢిల్లీలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో జలమండలి ఆపరేషన్స్ డైరెక్టర్ అజ్మీరా కృష్ణ కేంద్ర హాబిబేట్ సెంటర్ అధ్యక్షులు జి. పార్ధసారధి చేతుల మీదుగా అవార్డును అందుకున్నారు. ఈ కార్యక్రమాంలో హౌసింగ్ మరియు అర్బన్ డవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్(హాడ్కో) చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ డా. ఎం. రవికాంత్ తదితర అధికారులు పాల్గొన్నారు.

 

Hudco Award for Hyderabad water board