Home తాజా వార్తలు ఐఫోన్ల నుంచి భారీ మొత్తంలో బంగారం

ఐఫోన్ల నుంచి భారీ మొత్తంలో బంగారం

Apple-Iphoneయాపిల్ ఐఫోన్ ప్రతి ఒక్కరి కలల మొబైల్. ఒక్కసారైన ఐఫోన్ వాడితే బాగుండు అన్పించే ఆకర్షినీయమైన మొబైల్. ఈ ఫోన్ల తయారీలో బంగారాన్ని వాడతారని మనలో చాలా మందికి తెలిసి ఉండదు. సగటున ఒకో ఐఫోన్ తయారీలో 30 మిల్లీగ్రాముల బంగారం ఉపయోగిస్తారు. ఇప్పుడు యాపిల్ సంస్థ పాత గాడ్జెట్లను, ఫోన్లను రీసైక్లింగ్ చేసి బంగారాన్ని తీసుకుంటుందట. గత ఏడాది ఇలా దాదాపు 2,204 పౌండ్ల(టన్ను కంటే ఎక్కువ) బంగారాన్ని ఐఫోన్లను, ఐపాడ్లను, ఐమాక్లను రీసైక్లింగ్ చేసుకుందని కంపెనీ వార్షిక పర్యావరణ రిపోర్టులో పేర్కొంది. దీని విలువ సుమారు 40 మిలియన్ డాలర్లు ఉంటుందని కంపెనీ అంచనా. అయితే ఇక్కడ అసలు యాపిల్‌కు బంగారం ఎందుకు అవసరం అవుతుందనే అనుమానం కూడా రావచ్చు.

ఎలక్ట్రానిక్ ఉత్పత్తులో బంగారానికి ఓ ప్రత్యేకమైన స్థానం ఉంది. ఈ ఉత్పత్తులు తుప్పు పట్టకుండా, ఎక్కువ కాలం మన్నికగా పనిచేసేలా, అద్భుతమైన విద్యుత్ వాహకంలా బంగారం ఉపయోగపడుతుంది. వెండి, రాగిలను కూడా ఎలక్ట్రానిక్ ఉత్పత్తులో వాడతారు. అయితే అవి త్వరగా తుప్పుపట్టి, పాడయ్యే అవకాశం అధికంగా ఉండటంతోపాటు ముఖ్యమైన సమయంలో ఎలక్ట్రాన్ల ప్రయాణం నెమ్మదించడం వంటి లోపాలు ఉండటంతో వీటిని గాడ్జెట్ల తయారీ తక్కువగా వినియోగిస్తున్నారు. పాత ఐఫోన్ల నుంచి తీసుకున్న అతి ముఖ్యమైన పదార్థాల్లో బంగారం ఒకటని యాపిల్ సంస్థ వెల్లడించింది. ఇదేవిధంగా 23 మిలియన్ పౌండ్ల ఉక్కు, 13 మిలియన్ పౌండ్ల ప్లాస్టిక్, 12 మిలియన్ పౌండ్ల గ్లాస్, 4.5 మిలియన్ పౌండ్ల అల్యూమినియం, 3 మిలియన్ పౌండ్ల కాపర్, 6,600 పౌండ్ల సిల్వర్‌ను రీసైక్లింగ్ ద్వారా రాబట్టుకున్నట్లు యాపిల్ కంపెనీ ప్రకటించింది.