Home ఖమ్మం కమీషన్ల కక్కుర్తి

కమీషన్ల కక్కుర్తి

 అభివృద్ధి పనుల్లో నాణ్యతకు తిలోదకాలు
 సెలవుపై ఆర్‌అండ్‌బి ఉన్నతాధికారులు
 మిగిలిన శాఖలది ఇదే పరిస్థితి
 అధికారుల తీరుపై మంత్రి తుమ్మల అసంతృప్తి
 అధికారుల విభేదాలను సొమ్ము చేసుకుంటున్న కాంట్రాక్టర్లు

kmm2ఖమ్మం : అభివృద్ధి పనుల్లో నాణ్యత కొరవడుతుంది. ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మాకంగా చేపడుతున్న పనుల్లో నాణ్యతకు తిలోదకాలు ఇచ్చి కమీషన్లకు కక్కుర్తి పడుతున్నారు. కమీషన్ల వ్యవహారం శృతిమించి రోడ్లు, భవనాల శాఖలో ఇద్దరు అధికారుల మధ్య ఘర్షణ వాతావరణం చోటు చేసుకోవడంతో ఆ శాఖ మంత్రి ఇద్దరిని సెలవుపై వెళ్లాలని ఆదే శించినట్లు సమాచారం. మంత్రి ఆదేశించారో లేదో కాని ఆర్‌అండ్‌బి ఎస్‌సి సతీష్, ఇఇ నజీర్ అహ్మద్‌లు దీర్ఘకాలిక సెలవుపై వెళ్లారు. వీరి ఇద్దరి మధ్య తీవ్ర వివాదాలు చోటు చేసుకున్నాయి. జిల్లాలో ఆర్‌అండ్ బిలో పనులు చేసే ఓ కాంట్రాక్టర్‌తో పాటు ఖమ్మం ఇఇ పరిధిలో రోడ్ల కుదింపు, కమీషన్ల పంపకాలు విభేదాలకు కారణంగా తెలుస్తుంది. ఎస్‌ఇ, ఇఇల మధ్య విబేధాలను కాంట్రాక్టర్లు సొమ్ము చేసు కుంటు న్నట్లు సమాచారం.

ఇంజనీరింగ్ అధికారుల కమీషన్ల వ్యవ హారం గతంలోను చర్చనీయాం శమైంది. అర్ధరాత్రి రోడ్లు నిర్మాణం చేయడం, పనులు జరుగుతున్న సమ యంలో ఆ వైపునకు అధికారులు వెళ్లక పోవడం ఎలా చేసినా ఎంబిలు చేయ డం అలవాటుగా మారింది. జిల్లాలో జరిగిన పనులు పరిశీలించిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అసంతృప్తి వ్యక్తం చేశారు. మిగిలిన శాఖల పరిస్థితి ఇందుకు భిన్నంగా లేదు. మాముళ్లు ఇవ్వనిదే పని కాని పరిస్థితి. రెవెన్యూ, విద్యుత్ శాఖల్లో పరిస్థితి శృతి మించు తుందన్న వాదనలు వినిపి స్తున్నాయి. ఎసిబి అధికారులు పై రెండు శాఖలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారంటే అవి నీతి ఎంతగా బహిర్గతం అయిందో అవగతం అవుతుంది. గతంలో మెప్మా, హౌసింగ్‌తో ఇతర శాఖలలో కోట్ల రూపాయల అవినీతి రుజువైనా చర్యలు తీసుకోకపోవడంతో అవినీతి అధికా రులు మరింతగా చెలరేగి పోతున్నారు. ఇప్పటికైనా రాష్ట్రస్థాయి అధికారులు దృష్టి సారిస్తే తప్ప ప్రభుత్వ లక్షం నెరవేరదు. కోట్ల రూపాయల ప్రజా ధనం పక్కదారి పట్టకుండా ప్రజలకు మేలు జరుగుతుంది.