Search
Thursday 20 September 2018
  • :
  • :
Latest News

యాదాద్రిలో భక్తుల రద్దీ

Huge Deevoties Visit Sri Laxmi Narasimha Swami Temple
మనతెలంగాణ/యాదాద్రి ః నిత్యపూజలు అందుకుంటూ జగద్రక్షణ గావిస్తున్న శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి దర్శనార్థం తరలివస్తున్న భక్తుల రద్దీ యాదాద్రిలో కొనసాగుతూనే ఉంది. ఆదివారం వారంతపు సెలవు కావడంతో స్వామి వారిని దర్శించుకోవడానికి పిల్లాపాపలతో స్వామి వారిని దర్శించుకోవడానికి వివిధ ప్రాంతాల నుండి భక్తులు అధిక సంఖ్యలో వచ్చారు. భక్తుల వరుస రద్దీతో యాదగిరికొండపై సందడి నెలకొంది. భక్తుల రద్దీ దృష్టా ఆలయ అధికారులు తెల్లవారుజామున ఆలయాన్ని తెరిచి సుప్రభాత సేవ, అభిషేక, అర్చన నిత్య పూజా కార్యక్రమాలతో చేపట్టి 5.15గంటల నుండి సర్వదర్శనాలు ప్రారంభించారు. స్వామి వారి దర్శనార్థం వచ్చిన భక్తులు తమ మొక్కుబడిగా తలనీలాలను సమర్పించుకొని విష్ణు పుష్కరిణిలో స్నానమాచరించి స్వామి వారి కళ్యాణ సేవ, శ్రీసత్యనారాయణ స్వామివారి వ్రతపూజలు, అర్చన, అభిషేక పూజా కార్యక్రమాల్లో భక్తులు పాల్గొని స్వామి వారిని దర్శించుకున్నారు. కళ్యాణ కట్ట, ప్రసాదాల క్యూలైన్, దర్శన క్యూలైన్‌లలో వ్రతపూజల వద్ద ఆలయ పరిసర ప్రాంతాలలో ఉదయం నుండి భక్తుల సందడి నెలకొంది. శ్రీవారి అనుబంధ ఆలయాలైన పాతగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో కూడాభక్తుల సందడి నెలకొంది. యాదగిరికొండకు వచ్చిన భక్తులలో దాదాపు 60శాతం భక్తులు శ్రీపాతగుట్ట స్వామి వారిని దర్శించుకొని పూజా కార్యక్రమాలు నిర్వహించారు.
వర్షంతో భక్తుల ఇక్కట్లు
స్వామి దర్శనం కోసం భక్తులకు దర్శన ఇక్కట్లు తప్పలేదు. వాతావరణం చల్లదనంతో రెండు రోజులుగా వర్షం జల్లులు పడటంతో యాదగిరిగుట్ట కొండతో పాటు పట్టణ ప్రాంతం పూర్తిగా తడిసి ముద్దయింది. స్వామి వారి దర్శనార్ధం వచ్చిన భక్తులకు కొండపైన అభివృధ్ధి పనల కారణంగా సరైన సౌఖర్యాలు లేకపోవడంతో వర్షం వల్ల భక్తులు తడుస్తు ఇబ్బంది పడ్డారు. ఆదివారం భక్తుల రద్దీ పెరిగినప్పటికి వచ్చే పోయే దారులు కనీసం నిలబడలేని పరిస్థితి కొండపైన నెలకొంది. దీనికి తోడు కొండ క్రింద గోశాల, తులసి కాటేజీ, పాతగుట్ట దేవస్థాన ప్రాంతాలలో భక్తులు వర్షం కారణంతో విశ్రాంతి చేయలేకపోయారు. కుటుంబ సభ్యులతో వచ్చిన భక్తులు ఇక్కట్లు పడుతు స్వామి వారిని దర్శించుకొని తిరిగి ప్రయాణం చేశారు.
స్వామి వారిని దర్శించుకున్న మాజీ ఎమ్మేల్యే
శ్రీ లక్ష్మినరసింహ స్వామి వారిని జిల్లా కాంగ్రేస్ పార్టీ అధ్యక్షుడు, ఆలేరు మాజీ ఎమ్మేల్యే బూడిద బిక్షమయ్యగౌడ్ దర్శించుకున్నారు. నూతనంగా తన కుమారుడి వివాహం కావడంతో కుటుంబ సభ్యులతో కలిసి ఆయన స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయనకు ఆలయ అర్చకులు స్వామి వారి ఆశీర్వచనం ఇవ్వగా ఆలయ అధికారులు స్వామి వారి ప్రసాదాన్ని అందచేశారు. ఆయన వెంట గుండ్లపల్లి భరత్, తంగలపల్లి సుగుణాకర్ తదితరులు ఉన్నారు.
ఉద్యోగుల ఫోరంను కార్యాలయంను ప్రారంభించిన ఈఓ
యాదాద్రి దేవస్థానంలో పని చేయనున్న ఉద్యోగుల ఫోరం నూతన కార్యాలయంను ఆలయ ఈఓ గీత ప్రారంభించారు. కొండ పైన శ్రీ చక్ర గది నెంబర్ 16న నూతన కార్యాలయాన్ని ప్రారంభించి ఈఓ పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో చైర్మెన్ నరసింహమూర్తి, ఎఈఓ రామ్మోహన్, దేవస్థానం ఉద్యోగ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
నిత్యరాబడి 23.60 లక్షలు
శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానం యాదాద్రి క్షేత్రంలో స్వామివారి ఆలయం నిత్యరాబడి భాగంగా ఆదివారం రోజున 23 లక్షల 60 వేల 668 రూపాయలు ఆదాయం వచ్చినట్లు ఆలయ అధికారులు తెలిపారు. స్వామివారి దేవస్థానంలో ప్రధాన బుకింగ్ వ్రతపూజలు, అతిశ్రీఘ్ర దర్శనం కల్యాణ కట్ట, విచారణ శాఖ, ప్రసాదవిక్రయం, టోల్‌గేట్, శాశ్వత పూజలు, అన్నప్రసాదం, వాహన పూజలతో పాటు అనుభంద ఆలయమైన పాతగుట్ట దేవాలయం, వివిధ శాఖల నుండి స్వామివారి నిత్యరాబడి సమకూరినట్లు తెలిపారు.

Comments

comments