Search
Wednesday 14 November 2018
  • :
  • :
Latest News

అర్జైంటైనాలో భారీ డైనోసార్ శిలాజాలు

Dynosar

ఇదివరకు అనుకున్న దానికన్నా 200 మిలియన్ సంవత్సరాల క్రితమే రాకాసి డైనోసార్లు భూమి మీద నివసించేవి అనడానికి తగిన సాక్షాధారాలు లభించాయి.  అర్జైంటైనా లో తవ్వకాలు జరిపినప్పుడు 200 మిలియన్ సంవత్సరాల నాటి డైనోసార్ల శిలాజాలు బయటపడ్డాయి. ఈ తెగ డైనోసార్లు భారీ ట్రైయాసిక్ డైనోసార్లు కన్నా మూడింతలు పెద్దవిగా ఉన్నట్లు చెబుతున్నారు. అర్జెంటైనా రాజధాని బ్యూనోస్ ఎయిరెస్‌కు పశ్చిమంగా 1100 కిలోమీటర్ల దూరంలో బాల్డీ డి వేయెస్ తవ్వకాల ప్రదేశంలో ఈ అవశేషాలు లభించాయి.

ఈ అవశేషాలను చూడగానే ఏదో వింతగా విభిన్నంగా ఉందని అనుకున్నామని, శాన్‌జుయాన్ యూనివర్శిటీ పరిశోధకులు సెసీలియా అపల్‌డెట్టి చెప్పారు. ఆ ఆకారం చూడగానే మొదటి భారీ డైనోసార్లలో ఇదొకటని భావిస్తున్నట్టు తెలిపారు.  మెడ, తోక భాగాల్లో ముందు, వెనుక భాగాల్లో అనేక ఎముకలు కనిపించాయి. ఈ డైనోసార్లు శాకాహారి జంతువులు. చతుష్పాద ప్రాణులు, పొడవైన మెడ, తోకతో సులువుగా వీటిని గుర్తించవచ్చు. ఇవి సౌరోపాద్ గ్రూపునకు చెందినవి, ఇవి బయటపడకముందు 180 మిలియన్ సంవత్సరాల క్రితం జురాసిక్ యుగంలో భారీ జంతువులు అభివృద్ధి చెందాయని అనుకునేవారమని పరిశోధకులు చెప్పారు. త్రైయాసిక్ కాలం 250200 మిలియన్ సంవత్సరాల క్రితంకాగా, జురాసిక్ కాలం 200 నుండి 145 మిలియన్ సంవత్సరాల వరకు సాగిందని పరిశోధకులు తెలిపారు. ఈ తెగ డైనోసార్లు 8 నుంచి 10మీటర్ల పొడవునా తోకను పెంచుతాయి. 10 టన్నుల బరువు ఉంటాయి. ఆఫ్రికా ఏనుగులు రెండు మూడు కలిపితే ఎంతో అంత వీటి ఆకారం ఉంటుంది.

Comments

comments