Search
Tuesday 20 November 2018
  • :
  • :
Latest News

కార్పొరేట్ కు దీటుగా ప్రభుత్వ పాఠశాలు

Huge funding for infrastructure creation

మౌలిక సదుపాయాల కల్పనకు భారీ నిధులు
ఉమ్మడి వరంగల్ జిల్లానే ప్రయోగశాల
ఉపముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి 

మనతెలంగాణ/వరంగల్ అర్బన్ : ఉమ్మడి జిల్లాలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలో మౌలిక సదుపాయాలు కల్పించడమే కాకుండా విద్యార్థుల విద్యాభ్యాసంలో ఉమ్మడి జిల్లా రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని అందుకు ఎన్ని నిధులైనా ఖర్చు చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు ఉపముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి అన్నారు. ఈ ప్రాజెక్టును ఉమ్మడి వరంగల్ జిల్లాను ప్రయోగాత్మకంగా చేపట్టి రాష్ట్రంలో దీన్ని అమలు చేయనున్నట్లు చెప్పారు. వరంగల్ రూరల్ కలెక్టర్ కార్యాలయంలో ఉమ్మడి జిల్లా విద్యాశాఖపై గురువారం ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్, జనగాం, కలెక్టర్లు అమ్రపాలి, హరిత, వినయ్‌కృష్ణారెడ్డి, విద్యాశాఖ సంచాలకులు విజయ్‌కుమార్, విద్యాశాఖ చీఫ్ ఇంజనీర్ మల్లేశం, ఆర్‌జెడి రాజు, డిఈఒ నారాయణరెడ్డిలు పాల్గొనగా ఉపముఖ్యమం త్రి సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు చదువుకోవాలనే వాతావరణాన్ని కల్పించాలని ప్రతి పాఠశాలలో మౌళిక సదుపాయాలైన మూత్రశాలలు, నీటి సరఫరా, విద్యుత్ సరఫరా కనీస వసతులు, అదనపు తరగతి గదులు, ప్రహారీ గోడలు ఉండాలన్నారు. పాఠశాలలన్ని కొత్త ధనంతో కొట్టచ్చేవిధంగా కలర్‌లు వేసి తీర్చిదిద్దాలన్నారు. ఉపాధ్యాయుల బదిలీల నేపథ్యంలో వెంటనే ఖాళీలను గుర్తించి విద్యావాలంటీర్లను నియమించుకోవాలన్నారు. ప్రతిపాఠశాల ప్రొఫైల్ తయారు చేయాలని అందులో పాఠశాల విస్తీర్ణం, విద్యార్థులు, ఉపాధ్యాయుల సంఖ్య ఉన్నటువంటి సౌకర్యాలు కావాల్సిన వసతుల పూర్తి సమాచారం అందులో నిక్షిప్తం చేయాలన్నారు. ప్రతి మండలానికి కలిపి ఒక నివేదికను పాఠశాలల వారిగా రూపొందించాలన్నారు. ప్రాధాన్యతల ప్రకారం సంబంధిత పాఠశాలల్లో కావాల్సిన వసతులపై నివేదిక రూపొందించి ప్రభుత్వానికి పంపాలన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఏ ఒక్క విద్యార్థి కూడా కింద కూర్చోవడానికి వీల్లేదన్నారు. ప్రతి పాఠశాలల్లో డెస్క్‌లతో కూడిన ఫర్నీచర్ తప్పనిసరిగా ఉండాలన్నారు. పాత భవనాలన్నింటిని తక్షణమే మరమ్మత్తులు చేయించాలన్నారు. కార్పొరేట్ స్థాయి స్కూళ్ల భవనాలను నడిపించే విధంగా ప్రభుత్వ పాఠశాలలను  తయారు చేసి ఉన్నటువంటి గ్రౌండ్‌ను కూడా క్రీడలకు సిద్ధం చేసుకోవాలన్నారు. అందుకు సంబంధించిన ప్రతిపాదనలను తక్షణమే తయారు చేయాలన్నారు. వరంగల్ ఉమ్మడి జిల్లాలో ప్రభుత్వ విద్యాసంస్థలను ఆదర్శంగా తీర్చిదిద్దాలన్నారు. ఈ ప్రక్రియను ఉమ్మడి జిల్లాలోనే ప్రయోగాత్మకంగా చేపట్టి రాష్ట్రంలో అమలు చేయనున్నట్లు ఆయన సూచించారు. ఈ పనులకు సంబంధించిన నిధులు ఎంతమొత్తమైనప్పటికి ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రభుత్వ విద్యావిధానాన్ని బలోపేతం చేయడానికి నిధులను భారీ ఎత్తున ఖర్చు చేయనున్నట్లు చెప్పారు. నిధుల కొరత రాకుండా చూసుకునే బాధ్యత తమదేనని హామీ ఇచ్చారు. విద్యాశాఖ నుంచి ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయడమే ప్రధాన లక్షంగా పనిచేయడం జరుగుతుందన్నారు. ఇప్పటికే గురుకుల పాఠశాలలను కులాల వారిగా అందుబాటులోకి తీసుకరావడం జరిగిందన్నారు. ఫలితంగా రూ.కోట్ల నిధులు ప్రైవేటు పరం కాకుండా విద్యార్థుల తల్లిదండ్రులకు ఆ డబ్బు మిగలడమే కాకుండా ప్రభుత్వ గురుకుల విద్యా విధానంలో విద్యార్థులు వారి తల్లిదండ్రులు సంతృప్తి కరంగా ఉన్నట్లు చెప్పారు. ఈ సమావేశంలో ఐదు జిల్లాల విద్యాశాఖాధికారులు, ఎంఈఒలు పాల్గొన్నారు.

Comments

comments