Search
Monday 19 November 2018
  • :
  • :
Latest News

ఉపాధి కరువై.. ఊరికి దూరమై

Migration

బెజ్జూర్: బెజ్జూర్ మండల కేంద్రంతోపాటు 11 గ్రామపంచాయితీలలో ఉపాధి హామీ పనులు చేపట్టినప్పటికీ కూలీలు నిత్యం పనులకు వెళ్ళిన రోజు వారి కూలీ కూడా రావడంలేదు. పనిచేసిన ఫలితంలేదని కూలీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వలసలు నివారించేందుకు గ్రామీణ ప్రాంతాలలో పనిచేస్తున్న ఉపాధి హామీ పథకం ఆదుకోవడంలేదని కూలీలు ఆవేదన వ్య క్తం చేస్తున్నారు. ఉపాధి పని కోసం ఉదయాన్నే వెళ్ళి పనిచేసినప్పటికి కనీస కూలీ వంద రూపాయల కంటే తక్కువగానే వస్తుందని కూలీలు అంటున్నారు. అంతేకాకుండా కూలీలు గత వారం రోజుల క్రితం పని కోసం వెళ్ళితే కొంతమందికి ఉపాధి పనులు చేపట్టలేదు. అంతేకాకుండా మీ జాబ్‌కార్డులో పనిలేదు. రాలేదని చెప్పుతున్నారు. అంతేకాకుండా జాబ్ కార్డు పని ఉన్నవారు పనికి వెళ్ళితే అందరు సమానంగా పనిచేసినప్పటికీ కొన్ని గ్రూపులలో ఎక్కువ డబ్బులు వస్తున్నాయి. మరికొన్ని గ్రూపులలో తక్కువ డబ్బులు వస్తున్నాయని కూలీలు వాపోతున్నారు.

అందరికి సమాన పనికి సమాన డబ్బులు రావడంలేదు. ఎవరి చేతివాటను ప్రదర్శిస్తున్నారో వారికి ఎక్కువ డబ్బులు వస్తున్నాయని పలువురు ఆరోపిస్తున్నారు. అంతేకాకుండా పని చేయనివారికి కూడ డబ్బులు వస్తున్నాయని పలువురు ఆరోపిస్తున్నారు. పని చేసిన డబ్బులు రాకపోవడం మరికొందరికి పూర్తిగా పనిలేకపోవడం,మరికొంతమందికి జాబ్‌కార్డు అప్లై చేసిన రాకపోవడం ఇలా జరగడం వల్ల కూలీల అంత గత రెండు నెలల నుండి నిత్యం వందలాది పట్టణాలకు మంచిర్యా ల, పెద్దపల్లి, గోదావరిఖని, కరీంనగర్, హైద్రాబాద్, విజయవా డ, ఖమ్మం, గుంటూరుతదితర ప్రాంతాలకు వలసవెళ్ళికూ లీ కోసం పట్టణంలోని గ్రామాలకు వలస వెళ్ళాల్సి పరిస్దితి నెలకొంది. మండలంలోని ఆయా గ్రామాల ప్రజలు ఆరోపి స్తున్నారు. కరువుపీడిత ప్రాంతాలలో ప్రజలను ఆదుకో వాల్సిన ఉపాధి హామి పథకం నిర్వాహణపరమైన లోపాలతో క్షేత్రస్దాయిలో కూనరీల్లుతుంది.

ఈ విషయం పై అధికారులు స్పందించి ఉపాధి హామి కూలీలందరికి సమాన న్యాయం చేసి పనికి తగిన కూలీ డబ్బులు అందేలా చూసి అందరికి పనికల్పించి పట్టణాలకు వలస బాట వెళ్ళాకుండా చూడాలని కూలీలు ఆరోపిస్తున్నారు. ప్రతి ఏడాదిలో ప్రజావేధికలో తనిఖీ బృందాలు వెల్లడించిన ఉపాధి హామి అవకతవకలపై గట్టి చర్యలు తీసుకోకపో వడంతోనే మామూళ్ళగా సిబ్బంది అక్రమాలకు పాల్పడుతు న్నారు. అక్రమాల అడ్డుకట్టడానికి ప్రతి సంవత్సరం ప్రజావేధిక నిర్వహించినప్పటికి తనిఖీ బృందాలు ఉపాధి హామి పనుల పై క్షేత్రస్దాయి పరిశీలనను బయటపెట్టి అక్ర మాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటారో లేదో వేచి చూడాల్సిందే…! జాబ్‌కార్డులు మొత్తం 12,836, మొత్తం కూలీలు 28,272, పనిచేసిన కూలీలు 19,233, వంద రోజులు నిండిన వారు 930

Comments

comments