Home తాజా వార్తలు 14న భారీ చంద్రుడు

14న భారీ చంద్రుడు

MOONలండన్ : 14న అసాధారణ స్థాయిలో భారీ చంద్రుడు , మరింత వెలుగులు విరజిమ్ముతూ ఆకాశంలో ప్రత్యక్షమవనున్నాడు. 68 ఏళ్లలో భూమికి అత్యంత సమీపంగా వచ్చే సూపర్‌మూన్‌గా ఖగోళ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. వాతావరణం అనుకూలిస్తే పూర్తిస్థాయి పరిణామాన్ని ఆసియాలో వీక్షించే అవకాశం ఉందని వారు తెలిపారు. మేఘాలు, కాంతి కాలుష్యం లేకుండా ఉంటేనే భారీ చంద్రుడిని చూడడం సాధ్యమవుతుంది. ఈసారిభూమి నుంచి 356,509 కి.మీ. దూరంలో ఉండనుంది. చంద్రుడు సాధారణం కన్నా ప్రకాశవంతంగా ఉన్నట్లు సాధారణ పరిశీలనతోనే గుర్తించవచ్చని చెబుతున్నారు.