Home కలం పెద్దనోట్ల రద్దు : అరసం కవి సమ్మేళనం

పెద్దనోట్ల రద్దు : అరసం కవి సమ్మేళనం

ARASAM

ప్రముఖ అభ్యుదయ కవి ముఖ్దుం మొహియుద్దీన్ 109వ జయంతి, హైదరాబాద్ జిల్లా ప్రథమ అరసం ప్రధాన కార్యదర్శి, ప్రముఖ నవలా రచయిత వట్టికోట ఆళ్వారుస్వామి 56వ వర్థంతి సందర్భాలను పురస్కరించుకొని హైదరాబాద్ మహానగర శాఖ అభ్యుదయ రచయి తల సంఘం ‘పెద్దనోట్ల రద్దు- ప్రజల ఇక్కట్లు’ అనే అంశంపై మఖ్దుం భవన్ హైదరాబాద్‌లో 2017 ఫిబ్రవరి 5న విస్తృత కవి సమ్మేళనం నిర్వహించింది. ప్రారంభంలో మఖ్దుం మొహియుద్దీన్, వట్టికోట ఆళ్వా రు స్వామి చిత్రపటాలకు పూల మాలలు వేసి నివాళులర్పించారు. ఆలో చనాత్మకంగా, ఆసక్తిపూర్వకంగా సాగిన కవి సమ్మేళనంలో పాల్గొన్న ప్రముఖ కవి నాళేశ్వరం శంకర్ “రూపు మార్చుకుంటున్న నల్లధనం / నల్లధనం లోంచి వస్తున్న ప్రభుత్వం / నల్లధనాన్నెట్లా నిర్మూలిస్తుంది” అంటూ ప్రశ్నిస్తూ కవిత్వం చెప్పారు. కెవిఎల్ చమత్కారంగా ‘మన్‌కీబాత్’ ను ‘మంకీబాత్’గా ఎగతాళి చేస్తూ కవిత చదివారు. కొండపల్లి నీహారిణి తన కవితలో ‘పెద్ద నోట్ల రద్దులో ప్రభుత్వం చిత్తశుద్ధి కొరవడింద’ ని వేలెత్తి చూపారు. కందుకూరి శ్రీరాములు ‘ఏటిఎంల ముందు బారులు తీరిన ప్రజల బాధల’ ను తన కవితలో కళ్ళకు కట్టించారు.
మొత్తం ఇరవై మంది కవులు పాల్గొన్న ఈ కవి సమ్మేళనంలో కవులందరూ తమ స్వీయ కవితల్లో పెద్దనోట్ల రద్దును దుయ్యబడుతూ, సామాన్యుల ఇక్కట్లను కళ్లకు కట్టించారు. పేదవారి బ్యాంకు ఖాతాలో పది హేను లక్షల నగదు జమ చేస్తానని, విదేశాల్లోని నల్లడబ్బును తిరిగి మన దేశానికి రప్పిస్తానన్న మోడీ మాటలు బూటకాలేనని దెప్పిపొ డిచారు. ఇప్పుడు రచయితలు – కవులు వర్తమాన సామాజికాంశాలపై స్పందించి ప్రజలను జాగృతపరచే విధంగా తమ కలాలకు పదును పెట్టాల్సిన అవసరం వచ్చిందని పేర్కొ న్నారు. ఆనాలోచితంగా ప్రధాని మోడీ పెద్దనోట్లను రద్దు చేసి, సామాన్య ప్రజలు ఏటిఎంల ముందు నిలబడి చచ్చే పరిస్థితి తెచ్చిండ న్నారు. మరోవైపు కార్పొరేట్ సంస్థలకు ముందే విషయాన్ని లీకు చేసి, వారికి మాత్రం మేలు కలుగజేశాడన్నారు. అయినా విదేశాల్లోని నల్లధనాన్ని మాత్రం వెనుక కు తీసుకొచ్చే ధైర్యం చేయలేక పోతున్నాడన్నారు. ఈ సమ్మేళనంలో ఇంకా బాబ్జి, కె. ప్రభాకర్, పల్లె నర్సింహ, వయ్యా సామ్యేలు , పల్లేరు వీరస్వామి,ఎ. పరమాత్మ, పి.వరలక్ష్మి, భానూరి సత్యనారాయణ, బి.నాగభూషణం, కె.లక్ష్మినారాయణ, తిరుపాల్, రాపోలు సుదర్శన్ తదితరులు పాల్గొ న్నారు. రాష్ట్ర అరసం నిర్మాణ బాధ్యులు ఆదిరెడ్డి, సమ్మేళనంలో పాల్గొ న్న కవులందరికీ బహుమ తులను అందించారు. రాపోలు సుద ర్శన్ ప్రయోక్తగా వ్యవహరించారు.