Search
Friday 21 September 2018
  • :
  • :

శర్వానంద్‌కు భారీ పారితోషికం

sharvanandఇప్పుడున్న యంగ్ హీరోల్లో నటనాపరంగా మంచి క్రేజ్ ఉన్న హీరో శర్వానంద్. స్టార్ హీరోల తర్వాత ఉన్న హీరోల్లో ఇతనికి మంచి పాపులారిటీ ఉంది. బాక్సాఫీస్ రిటర్న్‌లో మాత్రం అతను కాస్త వెనుకబడి 10 కోట్ల మార్కు వద్దే ఉన్నాడు. అయితే రెమ్యునరేషన్ పరంగా మాత్రం సంచలనం సృష్టిస్తున్నాడు. కొత్త దర్శకుడు చంద్రమోహన్ తీస్తున్న శర్వానంద్ తదుపరి సినిమాను బివిఎస్‌ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నాడు. ఈ సినిమా కోసం  ఏకంగా కోటి రూపాయల పారితోషికాన్ని తీసుకోవడంతో పాటు ఓవర్సీస్ రైట్స్ అదనంగా తీసుకున్నాడట. ఇప్పుడు ఆ సినిమా రైట్స్‌ను దాదాపు 1.6 కోట్లకు అమ్మేసినట్లు తెలిసింది. అంటే శర్వానంద్‌కు 2.6 కోట్ల రెమ్యునరేషన్ దక్కినట్లే. పైగా ఈ సినిమాలో లక్కీ, గోల్డెన్ లెగ్‌గా పిలవబడుతున్న లావణ్య త్రిపాటి కాలేజ్ స్టూడెంట్‌గా నటిస్తోంది. అదొక ప్లస్ పాయింట్ అయ్యే అవకాశముంది. అందుకే ఓవర్సీస్‌లో ఈ సినిమాపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి.

Comments

comments