Search
Friday 16 November 2018
  • :
  • :

‘ఎస్-3’ టీజర్‌కు అనూహ్య స్పందన

suriyaసూర్య లేటెస్ట్ మూవీ ‘ఎస్-3’ టీజర్ చూస్తే సింగం సిరీస్‌లో అంతకుముందు వచ్చిన రెండు సినిమాలకు ఇది ఏమాత్రం తక్కువలేదనే టాక్ వినిపిస్తోంది. సూర్య నుంచి మాస్ ప్రేక్షకులు కోరుకునే అంశాలన్నీ ఇందులో ఉన్నాయి. హరి మరోసారి తనదైన స్పీడ్ చూపించాడు టీజర్‌లో. సినిమాలో యాక్షన్ మరీ ఎక్కువైనట్లుందని కొన్ని విమర్శలు వ్యక్తమయైనప్పటికీ మాస్ ప్రేక్షకులు ‘సింగం’ లవర్స్ మాత్రం ఈ సినిమా మీద బాగా ఆసక్తిని చూపిస్తున్నారు. వాళ్లను టీజర్ ఏ స్థాయిలో ఆకట్టుకుంటుందో చెప్పడానికి దీనికి వస్తున్న వ్యూసే నిదర్శనం. సౌతిండియాలో సూపర్‌స్టార్ రజనీకాంత్ సినిమా ‘కబాలి’ తర్వాత అత్యంత వేగంగా 30 లక్షల వ్యూస్ సంపాదించుకున్నది ‘ఎస్-3’ తమిళ టీజరే. ఒక్కరోజు వ్యవధిలోనే ఈ మార్కును అందుకుంది. తెలుగు టీజర్ కూడా మిలియన్ మార్కు దిశగా సాగుతోంది. సూర్య ఫాలోయింగ్ సౌతిండియాలో ఏ స్థాయిలో ఉందో చెప్పడానికి ఇదే నిదర్శనం. తనదైన శైలిలో వైవిధ్యమైన సినిమాలు చేస్తూ వస్తున్న సూర్య పలు బ్లాక్‌బస్టర్ హిట్స్‌ను అందుకుంటున్నాడు. ఇక సింగం-3 చిత్రంతో మరోసారి బ్లాక్‌బస్టర్ హిట్‌ను అందుకుంటాడన్న టాక్ వినిపిస్తోంది. ఈ చిత్రాన్ని డిసెంబర్ 19న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయబోతున్నారు.

Comments

comments