మన తెలంగాణ/సిటీబ్యూరో : ఈ నెల 26న జరుగనున్న గణతంత్ర దినోత్సవాలకు నగర, రాచకొండ, సైబరాబాద్ పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టారు. ముఖ్యంగా సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. సౌదీలో ఉన్న సయ్యద్ జకీర్ రహీమ్‌ను జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఎ) పోలీసులు విచారించడంతో నగరంలో ని ఠాణాలపై ఉగ్రవాదుల దాడి కుట్ర భగ్నమైంది. దీంతో నగర పోలీసులు అప్ర మత్తమయ్యారు. గణతంత్ర దినోత్సవాలలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు ముందు జాగ్రత్త చర్యగా గట్టి చర్యలు తీసుకుంటు న్నారు. ఇప్పటికే కమిషనర్లు మహేందర్‌రెడ్డి, సందీప్‌శాండిల్యా, మహేష్ భగవత్‌లు జోన్ డిసిపిలు, డివిజన్ ఎసిపిలతో సమావేశమై భద్రతా చర్యలపై ఆరా తీశారు. ప్రతి ఠాణా పరిధిలో గస్తీని పెంచారు.
ఇక గణతంత్ర దినో త్సవాలకు మూడు రోజుల గడువు ఉండడంతో నగర శివార్లలో వాహనాల తనిఖీలు ముమ్మరం చేశారు. ఇటీవల నగరంలో ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా (ఐఎస్ఐఎస్) ఉగ్రవాద సంస్థకు చెందిన పలువురు ఉగ్రవాదులు వరుసగా పట్టుబడిన నేపథ్యంలో ముఖ్యంగా పాతనగరంపై నిఘాను పెంచారు. ఇక రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో నిర్వహించే గణతంత్ర దినోత్సవాలపై భద్రతపై కూడా దృష్టి సారించారు. ఇప్పటికే ఇక్కడ బాంబ్ స్వాడ్ పోలీసులు గ్రౌండ్లో అణువణువున గాలింపు చేపట్టారు. వేడుకల రోజున సుమారు రెండు వేల మంది పోలీసులు ఇక్కడ భద్రతలో పాల్గొంటారు.పరేడ్ గ్రౌండ్‌కు వచ్చే వివిఐపిలు, విఐపిలు, ఇతర అధికారులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని చర్యలు చేపట్టారు. ప్రత్యేకంగా పార్కింగ్ కేంద్రాలను సైతం ఏర్పాటు చేశారు. ఇక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటన జరగకుండా ముందస్తుగా కట్టుదిట్టమైన చర్యలు చూపట్టారు.