Search
Saturday 22 September 2018
  • :
  • :
Latest News

శ్యామలకు భారీ మద్దతు

Shamala

‘బిగ్‌బాస్ 2’ రోజు రోజుకు ఆసక్తికరంగా మారుతోంది. ఈ రియాలిటీ షో నుంచి శ్యామల ఎలిమినేట్ కావడం చర్చనీయాంశంగా మారింది. ఎవరూ ఊహించనివిధంగా ఆమె ఎలిమినేట్ కావడంతో సోషల్ మీడియాలో ఆమెకు భారీ మద్దతు లభిస్తోంది. బిగ్‌బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత శ్యామల తనకు మద్దతు తెలిపిన వారికి సోషల్‌మీడియా ద్వారా కృతజ్ఞతలు తెలిపింది. ‘బై బై బిగ్ బాస్. బిగ్ బాస్‌లో పాల్గొన్నందుకు చాలా ఆనందంగా ఉంది. నాకు మద్దతు తెలిపిన అందరికీ కృతజ్ఞతలు’అని సోషల్ మీడియాలో పోస్టు చేసింది. ఈ సందర్భంగా శ్యామల మాట్లాడుతూ “బిగ్‌బాస్‌లో విజేతగా నిలవాలని ఎలాంటి ట్రిక్స్ ప్లే చేయలేదు. చివరి వరకు ఉందామనుకున్నాను. కానీ అనుకోని విధంగా బిగ్‌బాస్ నుంచి ఎలిమినేట్ అయ్యాను. దీప్తి సునయన మూలంగానే తాను తప్పుకోవాల్సి వచ్చింది. బిగ్‌బాస్ హౌజ్‌లో 28 రోజులు ఉన్నాను. మరికొన్ని రోజులు ఉంటే బాగుండేది. అయితే ఈ రియాలిటీ షోలో పాల్గొనడం మరచిపోలేని అనుభూతినిచ్చింది”అని పేర్కొంది. అయితే వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా శ్యామల మళ్లీ బిగ్‌బాస్ హౌజ్‌లోకి రావాలని ఆమె అభిమానులు కోరుకుంటున్నారు.

Comments

comments