Search
Friday 16 November 2018
  • :
  • :

ప్లాస్టిక్‌ను తింటున్నామా!

Meals

మనం తినే ప్రతి భోజనం ద్వారా వంద ప్లాస్టిక్ కణాలు పొట్టలోకి వెళ్తున్నాయని అమెరికాలోని హీరియట్ వాట్ యూనివర్సిటీ పరిశోధకులు వెల్లడించారు.  ఈ విషయాన్ని ఓ ప్రయోగం ద్వారా నిరూపించారు. డిన్నర్ సమయానికి ముందు  కంచానికి పక్కన పెట్రీ డిష్‌లను ఉంచారు. వీటి ప్రత్యేకత ఏమంటే ..ఈ గిన్నెలపై పడిన దుమ్ము వాటికే అతుక్కుపోతుంది. డిన్నర్ పూర్తయిన తర్వాత వాటిని పరిశీలించగా.. 20 నిముషాల భోజన సమయంలో 14 ప్లాస్టిక్ కణాలు వాటికి అతుక్కున్నట్లు గుర్తించారు. భోజనం పూర్తయ్యేసరికి సగటున 114 ప్లాస్టిక్ కణాలు మనం తినే భోజనంలో పడుతున్నాయట.

ఈ విధంగా ఏడాదికి సగటున ఒక మనిషి 68,415 ప్లాస్టిక్ ఫైబర్స్‌ను తింటున్నాడని పరిశోధకులు చెబుతున్నారు. మానవ శరీరంలో కూడా ప్లాస్టిక్ అవశేషాలు గుర్తించదగిన స్థాయిలోనే ఉన్నాయని తెలిపారు.  నేరుగా కాకున్నా రోజూ మనం ప్లాస్టిక్ ఎంతో కొంత తింటున్నట్లు శాస్త్రవేత్తలు చెబుతున్నారు.  మామూలు ఆహారంతో పోలిస్తే జలచరాలతో తయారైన ఆహారంలో ప్లాస్టిక్ అవశేషాలు ఎక్కువ. అందువల్ల చేపలను తినేవారు ఏడాదికి అదనంగా వంద ప్లాస్టిక్ అవశేషాలను తిన్నట్లేనని పరిశోధక బృంద సభ్యుడు టెడ్ హెన్నీ తెలిపాడు.

Comments

comments