Search
Wednesday 26 September 2018
  • :
  • :

నేపాల్‌కు వంద కోట్లు

New-Notes

కాఠ్మాండు : నేపాల్‌కు వంద కోట్ల విలువైన భారతీయ కరెన్సీని అందించాలని ఆర్‌బిఐ నిర్ణయం తీసుకుంది. నేపాల్‌లో భారతీయ వంద నోట్లకు కొరత ఏర్పడింది. ఈ క్రమంలో నేపాల్ రాష్ట్ర బ్యాంకు విజ్ఞప్తి మేరకు ఆర్‌బిఐ స్పందించింది. భారత్‌లో రూ.500, రూ.1000 నోట్లు రద్దు చేయడంతో నేపాల్‌లో కూడా నగదు కొరత ఏర్పడింది. నేపాల్‌లో భారతీయ నోట్ల మార్పిడి రేటును కూడా బాగా తగ్గించారు. సిటిజన్‌షిప్ ఆధారంగా రూ.2000 వరకకు అందజేస్తోంది. ఆర్‌బిఐ నుంచి నిధులు వచ్చేవరకు ఎక్స్‌చేంజి రేటులో మార్పు ఉండదని ఆర్‌బిఐ పేర్కొంది. ఇప్పటి వరకు ఏటా ఆరువందల కోట్ల రూపాయల వరకు మార్పిడి సౌకర్యాన్ని భారత్ పొడిగిస్తూ వస్తోంది. అయితే ఈ సారి నోట్ల రద్దు కారణంగా ఆ సౌకర్యాన్నిపొడిగించలేదు. ఈ ఏడాది ఎన్‌ఆర్‌బి రూ.1.20 కోట్లు మాత్రమే పొందింది.

Comments

comments