Home మెదక్ సంక్రాంతి లోగా వంద గ్రామాలు నగదు రహితం

సంక్రాంతి లోగా వంద గ్రామాలు నగదు రహితం

– సంపూర్ణంగా 25 గ్రామాలు పూర్తి
– టెన్త్ ఫలితాల సాధనకు మాక్ పరీక్షలు
– స్థలాల కొనుగోలుదారుల కోసం 9 అంశాలపై వాల్‌పోస్టర్
– విలేకరుల సమావేశంలో కలెక్టర్ మాణిక్యరాజ్

CASHFREE

మన తెలంగాణ / సంగారెడ్డి ప్రతినిధి : సంక్రాంతి నాటికి వంద గ్రామ పంచా యతీలను నగదు రహిత లావాదేవీల గ్రామాలుగా ప్రకటించేందుకు జిల్లా యంత్రాంగం అన్ని చర్యలు తీసుకుంటుందని సంగారెడ్డి జిల్లా కలెక్టర్ మాణిక్యరాజ్ కణ్ణన్ తెలిపారు. సంగారెడ్డి కలెక్టరేట్‌లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేక రుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం పెద్ద నోట్లను రద్దు చేసిన తర్వాత నగదు రహిత లావాదేవీలను తప్పనిసరిగా చేయాలన్న సూచన మేరకు జిల్లాలో పలు కార్యక్రమాలు చేపట్టడం జరిగిందన్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో బ్యాంకు మిత్రల ద్వారా దుకాణాదారుల ఫోన్ నంబరు, ఆదార్ నంబరును బ్యాంకు ఖాతా నంబరుతో అనుసందానం చేయడం జరిగిం దన్నారు. జిల్లాలో దాదాపు 470 గ్రామ పంచాయతీల్లో సర్వే చేయించగా, సుమారు ఆరు వేల దుకాణాలు వున్నట్టు లంచనా వేశామన్నారు. అన్ని గ్రామా ల్లో నగదు రహిత లావాదేవీలను కొనసాగించేందుకు ప్రతి కుటుంబంలో కనీసం ఒక బ్యాంకు ఖాతా అయిన ఆదార్ నంబరుతో అనుసంధానమయ్యేలా చర్యలు తీసుకున్నట్టు తెలిపారు. డిసెంబర్, 2016 నాటికి జిల్లాని 25 గ్రామ పంచాయతీలు వందకు వంద శాతం నగదు రహిత లావాదేవీల గ్రామాలుగా గుర్తించడం జరిగిందన్నారు. వచ్చే ఏడాది సంక్రాంతి వరకు వంద గ్రామ పంచా యతీలను వంద శాతం నగదు రహిత లావాదేవీల గ్రామాలుగా గుర్తించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.
మార్చి నెలలో జరుగనున్న పదవ తరగతి పరీక్షలపై తాము ప్రత్యేక దృష్టి సారిం చినట్లు తెలిపారు. విద్యార్థులు ఏ ఏ విషయాలపై వెనుకబడి వున్నారే విషయం తెలుసుకొనేందుకు అక్టోబర్, నవంబరు, డిసెంబర్ నెలల్లో గ్రేడింగ్ పరీక్షలు నిర్వహించినట్లు చెప్పారు. జనవరి నెలలో పదవ తరగతి విద్యార్థులకు ఫైనల్ పరీక్షల మాదిరిగా పరీక్షలు నిర్వహించి వారిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించడం జరుగుతుందన్నారు. అన్ని పాఠశాలల్లో ఇదే తరహా పరీక్షలు నిర్వహించేందుకు చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు.జిల్లాలో నెలకు సుమారు 13 వందల నుంచి 1500 వరకు ప్ర సవాలు జరుగుతున్నాయని, వాటిలో మొదటి కాన్పుకు వచ్చిన మహిళలను చైతన్యవంతం చేసి వైద్య ఆరోగ్య శాఖ, మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులు వారికి కౌన్సిలింగ్ ఇస్తారని అన్నారు. సుమారు 30 మంది రేర్ బ్లడ్ గ్రూపుగా గుర్తించడం జరిగిందని, వారికి కూడా కౌన్సిలింగ్ ఇ చ్చి అవసరమైన అన్ని వైద్య సలహాలు ఇస్తున్నట్టు చెప్పారు. మధ్యాహ్న భోజన పథకం కోసం సరఫరా అయ్యే సన్న బియ్యంలో నాణ్యత లోపించకుండా ఉండేం దుకు గట్టి చర్యలు తీసుకుంటు న్నామని అన్నారు. వాటి నాణ్యతను తెలుసుకొ నేందుకు సరఫరాఅయిన 24 గంటల లోపే సంబంధిత పాఠశాల ప్రధానోపా ధ్యాయులు దాన్ని వంట చేసి బియ్యం సరైనదా? లేదా? అనే విషయమై సర్టిఫై చేయాలన్నారు. నాసిరకం బియ్యాన్ని సర్టిఫై చేస్తే వారిపై క్రమశిక్షణ చర్యలు తప్పవని హెచ్చరించారు. జిల్లాలో 1.05 లక్షల మంది విద్యార్థులకు కుల దృవీక రణ పత్రాలు జారీకి సిద్దంగా ఉన్నాయని, వాటిని త్వరలో విద్యార్థులకు పంపిణీ చేస్తామని తెలిపారు. జూన్ 2, 2014 తర్వాత జన్మించిన శిశువులకు జనన దృవీకరణ పత్రాలు అందజేస్తామని అన్నారు. అంతేగాక మరణ దృవీకరణ ప త్రాలు కూడా అందజేయడం జరుగుతుందన్నారు. స్థలం కొనుగోలు చేసేటప్పు డు సరైన పత్రాలు తీసుకోకుండా రిజిష్టర్ అయిన తరువాత ఇబ్బందులకు గురై తమ దృష్టికి వచ్చిన కేసులపై దృష్టి సారించడం జరిగిందన్నారు. వారికి వెసలు బాటుగా స్థలం కొనుగోలు చేసేటప్పుడు కొనుగోలుదారుడు ఏఏ దృవీకరణ పత్రాలు తీసుకోవాలో వివరిస్తూ గోడ పత్రికను రూపొందించినట్లు తెలిపారు. అ న్ని ప్రభుత్వ కార్యాలయాల్లో గోడ పత్రికను ప్రదర్శిస్తామని వివరించారు. దీని ద్వారా సుమారు వంద శౠతం లిటిగేషన్స్ అరికట్టడం సాధ్యమవుతుంద న్నారు. త్వరలో ఈ సంగారెడ్డి మొబైల్ యాప్‌ను ఆవిష్కరించనున్నట్టు కలెక్టర్ మాణిక్యరాజ్ వెల్లడించారు. సాదాబైనమా విషయంలో వచ్చే 20 రోజుల్లో పూర్తిస్థాయిలో సదాబైనమా పూర్తి చేస్తామన్నారు. 2017 సంవత్సరంలో పంచాయతీల్లో ఉన్న లొసుగులను గుర్తించి వాటిని సంపూర్ణంగా అభివృద్ధి చేయ డం, ఆసుపత్రిలో మౌలికు సదుపాయాల ఏర్పాటు, వ్యవస్థాగత ప్రనసవాల సం ఖ్య పెంపుదల వంటి అంశాలపై దృష్టి సారించేందుకు కృషి చేస్తామని తెలిపారు. జెసి వెంకటేశ్వర్లు, డిఆర్‌ఓ రఘురాంశర్మ, డిపిఓ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.