Search
Thursday 15 November 2018
  • :
  • :

అంగన్‌వాడీలా!

విలీనంతో మూతపడనున్న వందలాది కేంద్రాలు? 

schoolsజిల్లాల నుంచి మన తెలంగాణ ప్రతినిధులు
హేతుబద్ధీకరణ పేరిట అంగన్‌వాడీ కేంద్రాలను సమీ ప కేంద్రాల్లో విలీనం చేయాలన్న నిర్ణయం వల్ల వంద ల సంఖ్యలో కేంద్రాలు మూతబడడం ఖాయంగా కన్పి స్తోంది. అయితే మూసివేయడం లేదని, విలీనం చేస్తు న్నామని ప్రభుత్వం చెబుతోంది. మూతపడ నున్న అంగన్‌వాడీ కేంద్రాలలో పనిచేసే సిబ్బంది, ఆయాలు తమ ఉద్యోగ భద్రతపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ నిర్ణయం ప్రకారం అంగన్‌వాడీ కేంద్రాలు నడవాలంటే ఆ కేంద్రం పరిధిలో కనీసం 20 మంది వరకు ఆరేళ్లలోపు పిల్లలు, ఐదు మంది వరకు గర్భిణు లు, బాలింతలు తప్పని సరిగా ఉండాలి. ఇందులో ఏ ఒక్కరి సంఖ్య తగ్గినా తమకు నివేదికివ్వాలని పేర్కొం టూ ప్రభుత్వం మండలస్థాయి కమిటీలకు దిశా నిర్దే శం చేసింది. అంగన్‌వాడీల హేతుబద్ధీకరణ కోసం తహశీల్దార్, మండల పరిషత్ అభివృద్ధి అధికారి, చైల్డ్ ప్రొటెక్షన్ డెవలప్‌మెంట్ అధికారి, మండల విద్యాధి కారితో మండలస్థాయి కమిటీలను ప్రభుత్వం నియ మించింది. వీరంతా అంగన్‌వాడీ కేంద్రాల సమాచా రాన్ని సేకరించి ప్రభుత్వానికి నివేదిస్తారు. అంగన్ వాడీ వర్కర్లు ఇచ్చే సమాచారం ఆధారంగా పిల్లలు, బాలింతలు, గర్భిణుల వివరాలను సేకరించి ప్రభు త్వానికి నివేదిస్తారు. ఈ సమాచారం ఆధారంగా ఆయా అంగన్‌వాడీ కేంద్రాలను సమీప ప్రభుత్వ పాఠ శాలల్లోకి తరలించనున్నారు.
గర్భవతులు, బాలింతలకు చక్కటి పోషకాహారం : ఆరోగ్యలక్ష్మి, సబల పథకాల ద్వారా గర్భవతులు, బాలింతలకు మహిళా, శిశు సంక్షేమశాఖ ఆధ్వర్యంలో అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా పోషకాహారాన్ని అందిస్తున్నారు. ఈ పథ కం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఐదు లక్షలకు పైగా నే లబ్ధి పొందుతున్నారు. కిశోర బాలికలు 14 నుండి 18 సంవత్సరాల వయస్సు ఉన్న వారి కి మూడు కిలోల బియ్యం, అరకిలో కంది పప్పు, పావుకిలో మంచినూనె, 16 కోడిగుడ్లు అనుబంధ పోషకంగా ఇంటికి సరఫరా చేస్తున్నారు.
ఏ జిల్లాల్లో ఎన్నెన్ని విలీనం : తాజాగా ప్రభు త్వం తీసుకున్న నిర్ణయంతో తెలంగాణలోని దాదాపు మెజారిటీ జిల్లాల్లో అంగన్ వాడీ కేంద్రా లు విలీనం కానున్నట్లు తెలిసింది. ఉమ్మడి ఆది లాబాద్ జిల్లాలో 1256 అంగన్ వాడీ కేంద్రాలు ఉండగా 314 కేంద్రాలు విలీనం చేయాలని అధికారులు గుర్తించారు. నిజామాబాద్ జిల్లాలో 548, కామారెడ్డి జిల్లాల్లో 312 అంగన్ వాడీ కేంద్రాలు మొత్తం 860 కేంద్రాలను విలీనం చేసేందుకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. వీటిలో మొదటి దశలో 697 కేంద్రాలు, రెండో దశలో 163 అంగన్ వాడీలను విలీనం చేయను న్నారు. రాజధాని హైదరాబాద్‌లోనే 912 అంగన్ వాడీ కేంద్రాలు ప్రస్తుతం కొనసాగు తుండగా వీటిలో 50 కేంద్రాలకు పైగా ఎత్తివేత కు రంగం సిద్ధమైనట్లు అధికార వర్గాల సమా చారం. వీటి ద్వారా 3 నుండి 6 ఏళ్లలోపు పిల్లలు 15,012 మంది , 6785 మంది గర్భిణు లు, 5180 మంది బాలింతలు లబ్ధి పొందు తున్నారు. వివిధ వైద్య సేవలతో పాటు పౌష్టికా హారం కూడా నెల నెలా అందుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో 50 కేంద్రాలు ఎత్తివేస్తున్న ట్లు ప్రచారం జరుగుతుండడంతో ఆయా వర్గాలు ఆందోళన చెందుతున్నారు. రంగారెడ్డి, వికారా బాద్, మేడ్చల్ జిల్లాల పరిధిలో 180 కేంద్రాల మూసివేతకు రంగం సిద్ధమైంది. ప్రస్తుతం రంగా రెడ్డి జిల్లాలో 1368 అంగన్ వాడీ కేంద్రాలు, 232 మినీ అంగన్ వాడీ కేంద్రాలు పని చేస్తు న్నాయి. రేషనలైజేషన్ పేరుతో ఒక్క రంగారెడ్డి జిల్లాలోనే 45 అంగన్ వాడీ కేంద్రాలను మూసే యడానికి, ఇతర కేంద్రాల్లో విలీనం చేయడానికి రంగం సిద్ధమైంది. వికారాబాద్ జిల్లాలో 973 అంగన్ వాడీ, 138 మినీ అంగన్‌వాడీలు కొనసాగుతుండగా దాదాపు వంద కేంద్రాలు మూతపడనున్నట్లు తెలుస్తోంది. మేడ్చల్ జిల్లా పరిధిలో 792 అంగన్ వాడీ కేంద్రాలు ఉండగా వీటిలో 20 వరకు ఎత్తి వేయనున్నారు. సంగారెడ్డి జిల్లాలో మొత్తం 3384 కేంద్రాలకు గాను 300 కేంద్రాలు విలీనం కానున్నాయి. వీటిలో మెదక్‌లో వంద, సిద్దిపేటలో వంద, సంగారెడ్డిలో వంద అంగన్ వాడీలు విలీనం కానున్నాయని అధికారులు చెబుతున్నారు. ఖమ్మం జిల్లాలో 1896 అంగన్ వాడీలు, 200 మినీ అంగన్ వాడీలుండగా వీటిలో 75 కేంద్రాలు విలీనం కానున్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 1434 అంగన్ వాడీ, 626 మినీ అంగన్ వాడీలు ఉండగా ఇందులో వంద కేంద్రాలు రద్దు కానున్నాయి. మహబూబాబాద్ జిల్లా పరిధిలో 1437 అంగన్ వాడీలు ఉండగా 195 కేంద్రాల ను ఎత్తివేతకు గుర్తించారు. వరంగల్ అర్భన్‌లో నూ 799 అంగన్ వాడీ కేంద్రాలు, రూరల్‌లో 908 కేంద్రాలు ప్రస్తుతం పని చేస్తున్నాయి. ఈ జిల్లాలో ఇంకా ఎత్తివేతపై పూర్తి గణాంకాలను అధికారులు వెల్లడించ లేదు. కరీంనగర్ జిల్లా లోనూ రేషనలైజేషన్ పెద్దగా ప్రభావం చూపడం లేదని తెలిస్తోంది. ప్రస్తుతం 777 కేంద్రాలు పని చేస్తుండగా ఏ ఒక్క కేంద్రాన్ని ఎత్తివేయడం లేదని అధికార వర్గాలు వెల్లడించాయి. పెద్ద పల్లి జిల్లాలో 706 అంగన్ వాడీలకు గాను 15 కేంద్రాలను సరెండర్ చేసే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు. మహబూబ్‌నగర్ జిల్లాలో 1829 అంగన్ వాడీలు ఉండగా ఇందు లో 70 పక్క కేంద్రాల్లో విలీనమయ్యే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. జోగుళాంబ -గద్వాల జిల్లాలో మొత్తం 713 అంగన్ వాడీలు ఉండగా ఇందులో 656 ప్రధానమైనవి కాగా మరో 57 మినీ అంగన్ వాడీలు ఉన్నాయి. మొత్తం 713లో 50- 100 వరకు ఎత్తివేతకు గురికావచ్చని తెలుస్తోంది.
మూసివేత కాదు..విలీనం మాత్రమే.. :
“అంగన్‌వాడీ కేంద్రాలను మూసి వేయడం లేదు.. కేవలం విలీనం మాత్రమే.. దీనిపై ప్రభు త్వం ఉన్నత స్థాయిలో ఇంకా నిర్ణయం తీసుకోలేదు. కాకపోతే విలీనానికి అవకాశం ఉన్న కేంద్రాల గణాంకాలను కూడా తెలుసు కుంటున్నాం” అని మహిళా శిశు సంక్షేమ శాఖ ఉన్నతాధికారులు విశ్లేషిస్తున్నారు.

Comments

comments