Search
Wednesday 21 November 2018
  • :
  • :

ఎటిఎంల ద్వారా సురక్షిత నీటి సరఫరా

Hundreds of water ATMs have sprung up across country

ఎటిఎంల నుంచి నగదు ఎలా డ్రా చేసుకుంటామో ఆ విధంగానే వాటర్ ఎటిఎంల నుంచి సురక్షిత నీటిని తీసుకోవచ్చు. దాదాపు 82 కోట్ల మంది ప్రజలకు పైపుల ద్వారా మంచినీటిని పొందే అవకాశం లేదు. దేశంలో 70 శాతం మంచి నీరు కాలుష్యమయమవుతోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం సురక్షిత మంచినీటిని అందించడానికి వాటర్ ఎటిఎంలను అంటే స్మాల్ వాటర్ ఎంటర్‌ప్రైజెస్‌ను ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తోంది. సేఫ్‌వాటర్ నెట్ వర్క్ (ఎస్‌డబ్లుఎన్) రూపొందించిన కొత్త నివేదిక ప్రకారం దాదాపు 37 కోట్ల మంది ప్రజలకు సురక్షిత మంచినీటిని అందించడానికి 2.2 లక్షల స్మాల్‌వాటర్ ఎంటర్‌ప్రైజెస్‌లను ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం రూ.44వేల కోట్లను ఖర్చు చేయాల్సి ఉంది. ముఖ్యంగా అర్బన్ ఏరియాల్లోని మురికివాడల్లో పైపుల ద్వారా నీటిని సరఫరా చేసే వ్యవస్థను ఏర్పాటు చేయడం కష్టమవుతోంది. ఇక గ్రామీణ ప్రాంతాల సంగతి చెప్పక్కరలేదు. కలుషిత జలాలే వారికి శరణ్యం. కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా (సిఎజి) ఇటీవల వెలువరించిన నివేదికలో గ్రామీణ జనాభాలో 18 శాతం మందికి మాత్రమే పైపుల ద్వారా సురక్షిత నీటిని పొందే అవకాశం ఉందని వెల్లడైంది. అంటే 2017 నాటికి అనుకున్న లక్షంలో 50 శాతం కూడా నెరవేరలేదని పేర్కొంది.

నాణ్యతలో భారత్‌కు 120వ ర్యాంకు
మొత్తం 120 దేశాల్లో నీటి నాణ్యతలో భారత్ 120 ర్యాంకులో ఉందని నీతి ఆయోగ్ వెల్లడించింది. దేశం లోని మొత్తం నీటి సరఫరాలో 70 శాతం కలుషితమేనని వెల్లడించింది. నీటి శుద్ధి ప్రక్రియకు కావలసిన రెవర్స్ ఆస్మోసిస్ వ్యవస్థల ఏర్పాటుకు సామర్థం కలిగిన వారు ఇంటి వద్దనే ఈ ప్రక్రియను ఏర్పాటు చేసుకోగలుగుతున్నారు. కానీ చాలామందికి ఇది సాధ్యం కావడం లేదు. కమ్యూనిటీ ప్యూరిఫికేషన్ వాటర్ ప్లాంట్లు నీటిని స్థానికంగా శుద్ధి చేయగలుగుతున్నాయి. ఈ సందర్భంగా వాటర్ ఎటిఎం అన్నది కేవలం నీటిని అందించే ప్రక్రియ.

కాయిన్ లేదా స్మార్టు కార్డు ద్వారా లేదా మానవ ప్రయత్నంగా ఆటోమేటిక్‌గా నీరు సరఫరా అవుతుందని ఎస్‌డబ్లుఎన్ ఉపాధ్యక్షుడు పూనమ్ సేవక్ వివరించారు. ఇది కమ్యూనిటీ ఆర్‌ఒ గా అభివర్ణించారు. కమ్యూనిటీ వాటర్ ప్యూరిఫికేషన్ ప్లాంట్లు 2014 లో తక్కువగా 12 వేల వరకు ఉండగా, 2018 నాటికి 50 వేల ప్లాంట్ల వరకు పెరిగాయి. ఇప్పుడు వీటిని ప్రభుత్వ ప్రణాళికలో చేర్చుతున్నారు. 2030 నాటికి నూటికి నూరు పాళ్లు పైపుల ద్వారా సురక్షిత నీటిని హర్‌ఘర్‌జల్ పథకం కింద అందించాలని ప్రభుత్వం లక్షంగా పెట్టుకుంది. ఈమేరకు మౌలిక సౌకర్యాల కల్పనకు 5లక్షల కోట్ల రూపాయలు అవసరమవుతాయి. అయితే ప్రభుత్వం ఆ మొత్తంలో కనీసం 10 శాతం కన్నా తక్కువ వెచ్చించినా సురక్షిత మంచి నీరు సరఫరా చేయడమవుతుందని ఎస్‌డబ్లుఎన్ అంచనా వేసింది.

కలుషిత జలాల బాధిత జిల్లాలు
నైట్రేట్ కాలుష్యం ఎక్కువగా 386 జిల్లాల్లో ఉండగా, ఫ్లోరైడ్ పీడిత జిల్లాలు 335 వరకు ఉన్నాయి. ఐరన్ ఎక్కువ శాతం ఉన్న జలాలు 301 జిల్లాల్లో ఉండగా, సేంద్రియ లవణాలు ఉన్న జలాలు 212 జిల్లాల్లో ఉన్నాయి. ఆర్సెనిక్ కాలుష్యం విస్తరించిన జలాలు 153 జిల్లాలకు అందుతున్నాయి. సీసం ఎక్కువ శాతం ఉన్న జలాలు 91జిల్లాలకు, క్రోమియమ్ ఎక్కువగా ఉన్న జలాలు ఆధారమైన జిల్లాలు 30,కేడ్మియమ్ ఎక్కువ శాతం ఉన్న భూగర్భ జలాలు అందుతున్న జిల్లాలు 24 వరకు ఉన్నాయి.
-మన తెలంగాణ/ సైన్స్ విభాగం

Hundreds of water ATMs have sprung up across country

Telangana Latest News

Comments

comments