Home జాతీయ వార్తలు పఠాన్‌కోట్‌లో జల్లెడ పడుతున్న భద్రతా దళాలు

పఠాన్‌కోట్‌లో జల్లెడ పడుతున్న భద్రతా దళాలు

PATANKOTఛండీఘర్ : పంజాబ్‌లోని పఠాన్‌కోట్ వైమానిక స్థావరంపై శనివారం ఉగ్రదాడి జరిగింది. ఈ క్రమంలో భద్రతా దళాలు తనిఖీలను ముమ్మరం చేశాయి. శనివారం ఉదయం వైమానిక స్థావరంపై దాడికి దిగిన ఉగ్రవాదులను భద్రతా బలగాలు తిప్పికొట్టాయి. కాల్పుల్లో ఐదుగురు ఉగ్రవాదులతో పాటు ముగ్గురు సైనికులు కూడా చనిపోయారు. ఈ దాడిలో ఆరుగురు పాల్గొన్నారన్న అనుమానంతో పోలీసులు ఇంకా ఈ ప్రాంతంలో తనిఖీలు చేస్తున్నారు. ఆదివారం ఉదయం ఏడున్నర గంటల నుంచి ఎస్‌ఐఏ, ఎస్‌ఎస్‌జీ బలగాలు పఠాన్‌కోట్ ప్రాంతంలో జల్లెడ పడుతున్నాయి.