Home జాతీయ వార్తలు కోపంతో భార్య ముక్క కొరికిన భర్త

కోపంతో భార్య ముక్క కొరికిన భర్త

Husband Attack on Wife In Uttharpradesh

లక్నో: భార్య తనకు చెప్పకుండా ఊరు వెళ్లిందన్న కోపంతో భార్య  ఊరు నుంచి తిరిగి రాగానే ఆగ్రహంతో ఆమెతో గొడవ కు దిగి ముక్కు కొరికి తవ్రంగా గాయపర్చిన సంఘటన ఉత్తరప్రదేశ్‌లోని షాజహాన్ పూర్ జిల్లాలో పల్హొరా గ్రామంలో చోటు చేసుకుంది. వివరాలలోకి వెళితే.. స్థానికుల కథనం ప్రకారం..అర్జున్,గీత ఇద్దరు దంపతులు. గీత ఐదు రోజుల క్రితం తన భర్త అర్జున్‌కు చెప్పకుండా బరేలీకి వెళ్లింది. తిరిగి వచ్చిన ఆమెను తన అనుమతి లేకుండా ఎక్కడికి వెళ్లావంటూ అర్జున్ నిలదీశాడు. అయితే గీత సమాధానం ఇవ్వకపోవడంతో ఆవేశంతో ఆమె పై దాడి చేసి ముక్కు కొరికాడు. స్థానికుల సమాచారం మేరకు సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు గాయపడిన గీతను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరిలించారు. బాధితురాలు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు అర్జున్ ను అదుపులోకి తీసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.