Search
Monday 19 November 2018
  • :
  • :
Latest News

అనుమానంతో భార్య గొంతు కోశాడు

Suicide

సిరిసిల్ల జిల్లాలో ఓ మృగాడి దాష్టీకం
నాలుగు నెలల గర్భిణీపై పాశవిక దాడి
తీవ్రగాయాలతో భార్య ఆస్పత్రిలో చేరిక
భయంతో భర్త కత్తితో ఆత్మహత్యాయత్నం
ఇద్దరి పరిస్థితి ఆందోళనాకరం
భర్తపై పోలీసులు కేసు నమోదు

ఇల్లంతకుంట: అనుమానంతో కరెంటు తీగలు, కత్తితో భార్యపై దాడిచేసి, భయంతో తానూ ఆత్మహత్య చేసుకున్న ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం ముస్కానిపేటలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. గ్రామానికి చెందిన బుర్ర మహేశ్(28)కు ఆరు నెలల క్రితం ఎల్లారెడ్డిపేట మండలం తిమ్మాపూర్ గ్రామానికి చెందిన ప్రియాంక(24)తో వివాహం జరిగింది. కాగా, ఇటీవల భార్యపై అనుమానం పెంచుకున్న మహేశ్ హింసించడం మొదలుపెట్టాడు. భర్త పెట్టే హింసను భరించలేక ప్రియాంక కొన్ని రోజుల క్రితం పుట్టింటికి వెళ్లింది. దీంతో పెద్ద మనుషులు సయోధ్య కుదర్చడంతో ప్రియాంక తండ్రి ఇటీవలే అత్తింట్లో వదిలివెళ్లాడు.

గురువారం రాత్రి మహేశ్ తన భార్య నిద్రిస్తున్న సమయంలో కరెంట్ తీగలతో హత్య చేసేందుకు యత్నించాడు. ఆమె ప్రతిఘటించడంతో కత్తితో దాడి చేసి గాయపర్చాడు. ప్రియాంక ఆరుపులకు స్థానికులు, కుటుంబికులు వచ్చి ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఆ వెంటనే భయంతో మహేశ్ కూడా కత్తితో గొంతు కోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఇద్దరు పరిస్థితి విషమంగాఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఈ విషయమై ఎస్‌ఐ లకా్ష్మరెడ్డి బాధితురాలి ఫిర్యాదు మేరకు మహేశ్‌పై కేసు నమోదు చేసినట్లు చెప్పారు. ప్రియాంక నాలుగు నెలల గర్భవతి అని, శుక్రవారం తమ స్వగ్రామమైన తిమ్మాపూర్‌లో శ్రీమంతం చేసేందుకు ఏర్పాట్లు చేశామని కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరయ్యారు.

Comments

comments