Home కుమ్రం భీం ఆసిఫాబాద్ భార్యభర్తల మధ్య గొడవ: ఇంటికి నిప్పు పెట్టిన భర్త

భార్యభర్తల మధ్య గొడవ: ఇంటికి నిప్పు పెట్టిన భర్త

Burnt House
కుమ్రం భీం ఆసిఫాబాద్: భార్యపై కోపంతో భర్త తన ఇంటికే నిప్పు పెట్టిన సంఘటన జిల్లాలోని జైనూర్ మండలం జంగాంలో చోటు చేసుకున్నది. ఆ మంటలకు గ్యాస్ సిలిండర్ పేలి ఇల్లు పూర్తిగా కాలిపోయింది. ఈ ఘటనలో భార్య, పిల్లలు తృటిలో ప్రమాదం తప్పించుకున్నారు. దంపతులు నారాయణ, యమునాబాయి మధ్య కుటుంబ కలహాలు ఉన్నాయి. పిల్లల ఆరోగ్య విషయమై ఇద్దరి మధ్య గొడవ జరిగింది. దీంతో కోపానికి లోనైన  నారాయణ ఇంటికి నిప్పు పెట్టాడు. స్థానికుల సమాచారం మేరకు సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు  ఘటనపై కేసు నమోదు చేసుకొని  దర్యాప్తు చేస్తున్నారు.

Husband burnt his house on the fight against wife