Search
Tuesday 18 September 2018
  • :
  • :
Latest News

ఫ్యాన్‌కు ఉరి వేసుకుని యువకుడి ఆత్మహత్య

Husband Commit Suicide in Vikarabad

మనతెలంగాణ/యాలాల: యాలాల మండలం కోకట్ గ్రామ పంచాయతి పరిధిలోని మిత్రానగర్ కాలనీలో బుధవారం ఉదయం ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. జీవన్గి రాములు ఇంట్లో ఓ యువకుడు సీలింగ్ ఫ్యాన్ కు ఉరివేసుకుని మృతి చెందాడు. గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం….  కర్ణాటక, సేడం తాలూక బట్టిగిరి గ్రామానికి చెందిన మల్లేశం గత కొన్ని సంవత్సరాలుగా తన భార్య బిడ్డలతో కోకట్ పరిదిలోని మిత్రానగర్ కాలనిలోని జీవన్గి రాములు ఇంటిలో కిరాయికి ఉంటున్నాడు. తాండూరు బస్సు డిపోలో నడుస్తున్న ప్రైవేటు బస్సులను శుభ్రం చేసే పని చేసుకుంటూ జీవనం కొనసాగించేవారు. అయితే నిత్యం సాయంత్రం పూట మద్యం సేవించి ఇంటికి వెళ్ళేవాడు. ఎప్పటి లాగే మంగళవారం కూడ మద్యం సేవించి ఇంటికి వెళ్లగా భార్య లక్ష్మీమల్లేశం (39) ని మందలించే క్రమంలో భార్య, భర్తల మద్య గొడవ జరిగింది. ఆవేశంలో ఉన్న మల్లేశం భార్య లక్ష్మీపై చెయి చేసుకున్నాడు. భర్త తనను ఇంకా కొడుతాడని బయపడ్డ భార్య లక్ష్మీ బయటకు వెళ్లిపోయింది. దీంతో అతడు మనస్తాపం చెందాడో లేక మృతుడికి ప్రైవేట్‌లో రూ. 70 వేల అప్పుకలదని భార్య లక్ష్మి తెలిపింది. ఆ అప్పు విషయంలో ఆలోచించి దిక్కు తోచక ఆత్మహత్య చేసుకున్నాడో తెలియదని పేర్కొంది. దీంతో ఓ కుటుంబం రోడ్డున పడినట్టుయిందని స్థానికులు వాపోయారు. దీంతో ఆ కాలనీలో విషాదచాయలు అలుముకున్నాయి.

Comments

comments