Search
Thursday 15 November 2018
  • :
  • :
Latest News

భార్యను కొట్టిచంపి.. భర్త బలవన్మరణం!

Husband Commits Suicide after Killed Wife

కరీంనగర్: కట్టుకున్న భార్యను రోకలిబండతో తలపై మోది హత్య చేసి ఆపై ఆత్మహత్య చేసుకున్న దారుణ ఘటన కరీంనగర్ జిల్లా ఇల్లందుకుంట మండలం సిరిసేడులో చోటుచేసుకుంది. స్థానికంగా ఉండే మల్లయ్య అనే వ్యక్తి భార్యను రోకలిబండతో కొట్టి ఆపై తాను ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Comments

comments