Search
Saturday 17 November 2018
  • :
  • :
Latest News

పెళ్లయిన నాలుగు రోజులకే..

రోకలిబండతో బాది భార్యను హత్య చేసిన భర్త
వనపర్తి జిల్లా ఖిల్లాఘణపురంలో విషాదం

Married-Women

వనపర్తి: పెళ్లయిన నాలుగు రో జులకే ఓ భర్త తన భార్యను రోకలిబండతో బాది హత్య చేసిన ఘటన వనపర్తి జిల్లా ఖిల్లాఘణపు రం మండల కేంద్రంలో కలకలం సృష్టించింది. వి వరాల్లోకి వెళ్తే.. పెద్దమందడి మండలానికి చెందిన గొల్ల వెంకటయ్య, చౌడమ్మ కూతురు నీలమ్మ (19)ని ఈ నెల 12న ఖిల్లాఘణపురం మండల కేంద్రానికి చెందిన గొల్ల అంజనేయులుకు ఇచ్చి వివా హం జరిపించారు. ఆదివారం రాత్రి భోజనం పెట్టాలని ఆంజనేయులు భార్య నీలమ్మను కోరగా ఆమె కొంత నిర్లక్షం చేయడంతో ఆగ్రహం వ్యక్తం చేశాడు. దీనికి అంజనేయులు తల్లిదండ్రులు అడ్డుచెప్పడంతో వారిపై కూడా దాడిచేసి కొట్లాడు. అడ్డుకోబోయిన భార్య నీలమ్మ తలపై రోకలిబండతో బాద డంతో అక్కడే కుప్పకూలింది. వెంటనే మహబూబ్‌నగర్‌లోని ఎస్‌విఎస్ ఆస్ప త్రికి తరలించగా చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందింది. నీలమ్మ తండ్రి వెంకటయ్య ఫిర్యాదు మేరకు ఖిల్లాఘనపురం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు తెలిపారు.

Comments

comments