Search
Wednesday 21 November 2018
  • :
  • :

అనుమానమే పెనుభూతమై భార్యను హతమార్చిన భర్త

Murdered

మంచిర్యాలటౌన్: పచ్చని కాపురంలో అనుమానం పెనుభూతమైంది. ప్రేమించి, పెళ్లాడిన వైవాహిక బంధంలో గొడవలు తలెత్తడంతో చివరకు భర్త సహనం కోల్పోయి కట్టుకున్న భార్యను ఆవేశంతో ఉరివేసి, చంపిన దారుణ సంఘటన మంచిర్యాల పోలీసు స్టేషన్‌పరిధిలో చోటు చేసుకుంది. సిఐ సుధాకర్, ఎస్‌ఐ వేణుగోపాల్‌లు కథన ప్రకారం పట్టణంలోని తిలక్‌నగర్ ప్రాంతానికి చెందిన మంచర్ల రమేష్ అనే వ్యక్తి పెద్దకుమార్తె రజిత (20) పెద్దపల్లి జిల్లాకు చెందిన అనిల్‌ని ప్రేమించింది.

వీరికి 2015లో వివాహం కాగా మంచిర్యాలలో ఉంటూ కూలీని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఇద్దరి మధ్య తరుచూ గొడవలు జరుగుతుండేవి బుధవారం రాత్రి తీవ్ర స్థాయిలో గొడవ పడ్డారు. తెల్లవారు జామున వీరి కుమార్తె బిగ్గర ఏడవడంతో పక్క ఇంట్లో ఉన్న రజిత తల్లిదండ్రులు ఆందోళనకు గురై కుమార్తె ఇంటికి వచ్చి తలుపులు గట్టి నెట్టి వేసి చూడగా రజితను దూలానికి ఉరివేసి చంపే ప్రయత్నం చేశారు. ఇంట్లోకి వచ్చిన అత్తామామలను చూసిన అల్లుడు అనిల్, రజితను కిందికి దించాడు. భర్త వేధింపులతో అపస్మార స్థితికి వెళ్లిన రజిత మృతి చెందింది. మృతురాలి తండ్రి మంచర్ల రమేష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సిఐ తెలిపారు.

Comments

comments