Home తాజా వార్తలు భార్యను కత్తితో పొడిచి చంపిన భర్త!

భార్యను కత్తితో పొడిచి చంపిన భర్త!

Husband Killed Wife attack with Knife in Mahabubabad District

మహబూబాబాద్: భార్యను భర్త కత్తి పొడిచి హతమార్చిన దారుణ ఘటన మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండలం రేపోనిలో చోటుచేసుకుంది. కుటుంబకలహాల నేపథ్యంలో భార్య రజిత(25)ను అతి కిరాతకంగా కత్తితో పొడిచి చంపేశాడు భర్త. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.