Search
Monday 24 September 2018
  • :
  • :

భార్య గొంతు కోసి హత్య చేసిన భర్త…

husband Murdered his wife in nalgonda District

తిప్పర్తి: ఇష్టంలేని పెళ్ళి వివాహిత నిండు ప్రాణాలు బలిగొంది. ప్రేమ పేరుతో ఒత్తిడి చేసి మరీ పెళ్ళి చేసుకుందున్న అక్కసుతో 5మాసాలు తిరగముందే దారుణంగా హత్య చేసిన ఘటన సోమవారం నల్గొండ జిల్లాలో చోటు చేసుకుంది. గ్రామస్థులు  తెలిపిన వివరాల ప్రకారం…నల్లగొండ జిల్లా తిప్పర్తి మండలం మల్లేపల్లివారిగూడెంకు చెందిన హసీనా(22) అదే గ్రామానికి చెందిన జంజిరాల శ్రీనివాస్‌ను ప్రేమించింది. ప్రేమించుకుని పెళ్ళి చేసుకుందామంటే నిరాకరించడంతో హసీనా 6నెలల క్రితం శ్రీనివాస్ ఇంటి ముందు న్యాయం కోసం ఆందోళనకు దిగింది. దీంతో పోలీసులు, గ్రామపెద్దలు జోక్యం చేసుకొని ఇద్దరి కుటుంబాలను ఒప్పించి ప్రేమ వివాహం జరిపించారు. ఆ తర్వాత కొంత కాలం కొత్తకాపురం సాఫీగానే సాగినా ఇటీవల హసీనా గర్భం దాల్చడంతో ఇక్కడే అసలు వివాదం మొదలైంది.

గర్భం ఉంచుకోవద్దని, అబార్షన్ చేయించుకోవాలని ఒత్తిడి తీసుకొచ్చినట్టు గ్రామస్థులు తెలియజేస్తున్నారు. ఈ నేపధ్యంలో ఇద్దరి మద్య వివాదం తీవ్ర రూపం దాల్చడంతో హసీనా పుట్టింటికి వెళ్ళి కుటుంబ సభ్యులతో అక్కడే ఉంటుంది. హసీనా గ్రామం కూడా మల్లేపల్లివారిగూడెం కావడంతో హసీనపై మనస్సులో కక్ష పెంచుకున్న శ్రీనివాస్ అదును చూసి సోమవారం ఒంటిరిగా ఉన్న హసీనాను ఇంటిలోనే పదునైన కత్తితో గొంతుకోసి దారుణంగా హత్యచేశాడు.దీంతో తీవ్రరక్తస్రావం జరిగి రక్తపుమడుగులోనే గిలాగిలాకొట్టుకుంటూ.. తుదిశ్వాస విడిచింది. దీంతో గ్రామస్థులు పోలీసులకు సమాచారం అందించడంతో ఘటన స్థలికి చేరుకొని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. నిందితుడు శ్రీనివాస్ పరారీలో ఉండగా ప్రత్యేక బృందంతో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

Comments

comments