Home భద్రాద్రి కొత్తగూడెం అనుమానంతో భార్యను కడతేర్చిన భర్త

అనుమానంతో భార్యను కడతేర్చిన భర్త

murder

బూర్గంపహాడ్: మరో వ్యక్తి తో సహజీవ నం చేస్తుందనే అనుమా నంతో ఓ వ్యక్తి భార్యను హత్య చేసిన ఘటన భద్రా ద్రి జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. బూర్గంపహాడ్ మండల పరిధిలోని ఇర వెండి గ్రామానికి చెందిన వరసా కనకమ్మ (45) కొన్నాళ్ల క్రితం భర్త వరసా భద్రయ్య ను వదిలేసి, అదే గ్రామానికి చెందిన మరో వ్యక్తితో సహజీవనం చేస్తోంది. ఈ క్రమం లో భార్యపై అనుమానంతో భద్రయ్య బుధవారం తెల్లవారుజామున బలమైన ఆయుధంతో తలపై కొట్టగా అక్కడికక్కడే మృతి చెందింది. స్థానికుల సమాచా రంతో పాల్వం చ సిఐ సూకూర్ సమక్షంలో ఎస్‌ఐ ఉదయ్‌కిరణ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడు పరారీలో ఉన్నాడని తెలిపారు.