Home రాజన్న సిరిసిల్ల భర్తల పెత్తనం ఇంకా ఎన్నాళ్లు

భర్తల పెత్తనం ఇంకా ఎన్నాళ్లు

  Village People Discussion on Sarpanch Elections in Kamareddy

ఇల్లందకుంట:  భారతరాజ్యాంగం మహిళలకు కల్పించిన రిజర్వేషన్ ఫలాలు వారికి అందడంలేదు. రిజర్వేషన్ కోటా లో ఎన్నికైన మహిళ సర్పంచ్ లు ,ఎంపిటిసిలు కేవలం ఇంటి,వ్యవసా యపనులకు అంకితమవుతున్నామని తమ పదవులను తమ భర్తలు తమ పేరు చెప్పి అనుభవిస్తున్నారని పలువురి మహిళా ప్రజాప్రతినిదు లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

పురుషులతో సమానంగా మహిళలు అన్ని రంగాల్లోను ముందంజలో ఉండగా సర్పంచ్ ,ఎంపిటిసిలుగా మహిళ కోటలో గెలిచిన తమకు స్వేచ్చ ఇవ్వకుండా పురుషులు తమ ను అడుగడున అడ్డుకుంటున్నారని కనీసం గ్రామపంచాయతి కార్యా లయాల్లోకి వెళ్లి తమ కుర్చీలో కూర్చోకుండా పెత్తనం చెలాయి స్తున్నారని కొన్ని సార్లు మండల,జిల్లా సమీక్ష సమావేశాలకు తమకు బదులుగా మగవారే వెళ్తున్నారనే ఇందువల్ల తమకు ప్రజాసమస్యలపై ప్రభుత్వ పథకాలపై అవగాహన కొరవడుతుందని వారు ఆవేధన వ్యక్తం చేశారు.

హుజురాబాద్ రెవెన్యూ డివిజన్ పరిధిలోని జమ్మికుంట,ఇల్లందకుంట,వీణవంక తదితర ప్రాంతాల్లో రిజర్వేషన్ ఫలితాలు అందడంలేదని మహిళా ప్రజాప్రతినిధులు ఆవేదన వ్యక్తం చేశారు.మహిళలకు రిజర్వేషన్‌లు కల్పించామని పాలకులు ప్రగల్భా లు పలుకుతుంటే మగరాయుళ్లు మాత్రం మహిళల పదవులను లాక్కొని పెత్తనం చెలాయిస్తూ నానా ఇబ్బందులు గురిచేస్తున్నా రని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఇల్లందకుంటలో గ్రామ పంచా యతి రిజర్వేషన్ పుణ్యమా అని ఆ గ్రామానికి చెందిన మహిళా సర్పం చ్ 2013లో సర్పంచ్‌గా ఎన్నికయ్యారు. సర్పంచ్ బదులుగా ఆమె భర్త సమావేశాలకు నీ తరుపున నేనే వెళ్తానని చెప్పి ఆమెను మెట్టినిల్లు దాటకుండా ఉంచాడని మహిళాప్రజాప్రతినిధులు ఆరోపిస్తున్నారు. సర్పంచ్‌కు మంజూరైన గౌరవవేతనం కూడా తమకు సక్రమంగా అందడంలేదని బ్యాంకుల ద్వారా డ్రా చేసుకొని మగ రాయుళ్లే వాటిని ఖర్చు పెట్టుకుంటున్నారని ఇప్పటికైనా తమకు రిజర్వేషన్ ఫలాలు అందేటట్లు కృషిచేయాలని కోరుతున్నారు.