Home తాజా వార్తలు రోడ్డు ప్రమాదంలో భార్యా భర్తలు మృతి

రోడ్డు ప్రమాదంలో భార్యా భర్తలు మృతి

Husband wife dead in road accident

సత్తుపల్లి: రోడ్డు ప్రమాదంలో భార్య భర్తలు మృతి చెందిన ఘటన సోమవారం మండలంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… దమ్మపేట మండలంలోని మొద్దులగూడెంకు చెందిన వాడపల్లి గాంధీ (28), వాడపల్లి వెంకటేశ్వరమ్మ (23) దంపతులు తమ ఇద్దరు కుమార్తెలు మనీషా, మానసలతో కలిసి ద్విచక్రవాహనం పై సత్తుపల్లికి వస్తున్నారు. సత్తుపల్లి మండలంలోని గంగారం గ్రామం శివారులోకి వచ్చేసరికి ఖమ్మం వైపు నుండి అశ్వారావుపేట వైపుకు వెళ్తున్న లారీ ఎదురుగా వచ్చి ఢీకొంది. దీంతో గాంధీ అక్కడికక్కడే మృతి చెందాడు. వెంకటేశ్వరమ్మకు కూడా తీవ్ర గాయాలు కావడంతో 108 వాహనంలో సత్తుపల్లికి తరలిస్తుండగా మార్గం మధ్యలో మృతి చెందింది. కుమార్తె మనీషాకు స్వల్ప గాయాలు కాగా మానసకు ఎటువంటి గాయం కాకపోవడం విశేషం. మృతదేహాలను సత్తుపల్లి ప్రభుత్వ ఆసుపత్రి మార్చురికి తరలించి శవ పంచనామా అనంతరం మొద్దులగూడెంకు తరలించారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు సిఐ ఎం.వెంకటనర్సయ్య తెలిపారు. తల్లిదండ్రులు మృతి చెందడంతో ఇద్దరు కుమార్తెలు అనాథలుగా మిగిలారు.