హుస్నాబాద్ గౌరవెళ్లి రిజర్వాయర్ భూ సేకరణ త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ వెంకట్రామారెడ్డి అధికారులను ఆదేశించారు. మం గళవారం సిద్దిపేట సమీకృత కలెక్టరేట్ కార్యాలయంలో అధికారులు, ఏజెన్సీలతో సమీక్షా సమావేశం నిర్వహిం చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గౌరవెల్లి రిజర్వాయర్ భూసేకరణపై ప్రతి మంగళవారం జాయింట్ కలెక్టర్ పద్మాకర్, డీఆర్వో చంద్రశేఖర్‌లు హుస్నాబాద్‌కు వెళ్లి సమీక్షించాలన్నారు. గౌరవెళ్లి రిజర్వాయర్ కట్ట పనులు వేగ వంతం చేయాలని సూచించారు. భూసేకరణపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. చిన్నకోడూరు, సిద్దిపేట, నంగునూరు మండ లాల మీదుగా వెలుతున్న కాల్వల భూసేకరణ అంశాలపై తహ సీల్దార్లు రంగనాయక సాగర్, కుడి, ఎడమ కాల్వల భూసేకరణపై ఆయా ప్రాంతాలలోని స్ట్రక్చర్ వాల్యూస్ ఇవ్వాలని సూచించారు. ఈ సమీక్షలో జెసి పద్మాకర్, డీఆర్వో చంద్రశేఖర్, ఆర్డీవోలు ముత్యం రెడ్డి, శంకర్, ఇరిగేషణ్ ఏఈఈ ఖాజా మోహినోద్దిన్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.