Home రాజన్న సిరిసిల్ల విద్యుత్‌ షార్ట్ సర్యూట్‌తో గుడిసె దగ్ధం

విద్యుత్‌ షార్ట్ సర్యూట్‌తో గుడిసె దగ్ధం

30 మూగజీవాలు అగ్నికి ఆహుతి

Hut Burnt With Electrical Short Circuit

వీర్నపల్లి : విద్యుత్ షార్ట్ స ర్యూ ట్ వల్ల గుడిసె దగ్ధమయి అందులో ఉన్న 30 మేకలు సజీవ దహనమైన ఘటన వీర్నపల్లి మం డలం వన్‌పల్లి గ్రామంలో గురువారం అర్ద్ర రాత్రి దాటాక చోటుచేసుకుంది. వివరాలకు గ్రా మానికి చెందిన ఉప్పునీటి చిన్నబాలయ్య అనే వ్యక్తి చాలా కాలంగా మేకలు, గొర్రెలు పెంపకం తో కుటుంబాన్ని పోషించుకుంటున్నా డు. ఎప్ప టిలాగే తన మేకల మందను గుడిసెలో నిలిపి ఇంటిలో నిద్రించాడు. రాత్రి ఒంటిగంట దాటి న సమయంలో కాలుతున్న వాసనతో పాటు జీవాల అరుపులకు చు ట్టుపక్కల వారు లేచి చూసే సరికి గుడిసె దగ్ధమయింది.

అప్పటికే 20కి పైగా జీవాలు అగ్నికి ఆహుతవగా మరికొ న్ని బయటకు పరిగెత్తే ప్రయత్నం చేశాయి. అవికూడా చాలా మొత్తంలో కాలి పోయి మరణించాయి. ఈ సంఘటనలో సుమా రు 30జీవాలు మృతిచెందినట్లు, విద్యుత్ షార్ట్ సర్యూట్ వల్లే ప్రమాదం జరిగినట్లు స్థానికులు భావిస్తున్నారు. సమాచారం అందుకున్న ఎస్సై నరేశ్‌కుమార్ ఫైర్ సిబ్బందికి సమాచారం అందించాడు. సుమారు రూ. 4లక్షలు నష్టం వాటిల్లినట్లు బాధితుడు తెలిపాడు. బాధితులను తహసీల్దార్ అలీమోద్దీన్, ఆర్‌ఐ షమీ, వీఆర్‌ఓలు పరామర్శించి సంఘట నపై నివేదికను పై అధికారులకు అందజేస్తామ న్నారు. బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకునే ందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.