Search
Saturday 22 September 2018
  • :
  • :
Latest News

350 మిలియన్ డాలర్లు సేకరించిన హైదరాబాద్ విమానాశ్రయం

gmrన్యూఢిల్లీ: జిఎంఆర్ హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం(జిహెచ్‌ఐఎఎల్) డాలర్ బాండ్ల ద్వారా 350 మిలియన్ డాలర్లను సేకరించింది. దానిని రీఫైనాన్స్ రుణాల కు, అలాగే కొంత భాగం మూలధన వ్యయం(కెపిటల్ ఎక్స్‌పెండిచర్)కు ఖర్చు చేయనున్నది. ప్రస్తుత విదేశీమారక విలువ ప్రకారం ఈ 350 మిలియన్ డాలర్లు రూ. 2,275 కోట్లు విలువ చేస్తుంది. జిహెచ్‌ఐఎఎల్ డాలర్ బాండ్ల ధర 4.25 శాతంగా నిర్ణయించినట్లు సమాచారం. హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం జాయంట్ వెంచర్‌లో జిఎంఆర్ గ్రూపుకు 63 శాతం, భారత ప్రభుత్వానికి 13 శాతం, తెలంగాణ ప్రభుత్వానికి 13 శాతం, మలేషియా ఎయిర్‌పోర్ట్ హోల్డింగ్స్ బెర్హాడ్‌కు 11 శాతం భాగస్వామ్య వాటా వుంది.
కంపెనీ ప్రకటన ప్రకారం 2017 మార్చి 31 నాటికి రూ. 1965.12 కోట్ల అప్పు ఉంది. అందులో రూ. 421.15 కోట్లు బ్యాంకుల నుంచి విదేశీ కరెన్సీ రుణంగా తీసుకున్నది. బ్యాంకుల నుంచి టర్మ్ రుణం కింద రూ. 1228.92 కోట్లు, తెలంగాణ ప్రభుత్వం నుంచి టర్మ్ రుణం కింద రూ. 315.05 కోట్లు తీసుకుంది. గత ఏడాదితో పోల్చినప్పుడు 2018 తొలి త్రైమాసికంలో 71.11 శాతం నికర లాభం అనగా రూ. 107.80 కోట్లు సముపార్జించింది. స్థూ ల ఆదాయం తొలి త్రైమాసికంలో 15.22 శాతం అనగా రూ. 293.60గా ఉంది.

Comments

comments