Search
Sunday 23 September 2018
  • :
  • :

బయోలో హైదరాబాద్

ktr

జీవశాస్త్ర రంగాల్లో మన రాజధాని ప్రపంచానికే గమ్యస్థానం కానున్నది
భాగ్యనగరం అతిపెద్ద ఔషధ నగరిగా మారనున్నది
ఫెర్రింగ్ ఫార్మా లేబొరేటరీ శంకుస్థాపన సందర్భంగా మంత్రి కెటిఆర్

మన తెలంగాణ / హైదరాబాద్ : జీవశాస్త్ర రంగా ల్లో హైదరాబాద్ ప్రపంచానికే గమ్యస్థానంగా మారుతోందని పరిశ్రమలు, ఐటిశాఖ మంత్రి కెటి. రామారావు ఉద్ఘాటించారు.  హైదరాబాద్ శామీర్‌పేట బయోటెక్ పార్కు ఫేజ్2లో ఫెర్రింగ్ ఫార్మాస్యూటికల్స్ లాబరేటరీకి శనివారం నాడు ఆయన శంకుస్థాపన చేశారు. హైదరాబాద్ పరిసరాల్లో 19 వేల ఎకరాల్లో ఔషధ నగరి రానుందన్నారు. ప్రపంచంలోనే ఏకైక అతిపెద్ద ఔషధ సమూహం ఇదే అవుతుందన్నారు. ఇప్పటికే 18 పరిశ్రమలు వైద్య పరికరాల (మెడికల్ డివైజెస్) తయారీపై దృష్టి సారిస్తున్నాయన్నారు. ఇవన్నీ కలిపి జీవ శాస్త్రరంగంలో పెట్టుబడులకు హైదరాబాద్  ప్రధా న గమ్యస్థానం కానుందని అంచనా వేస్తున్నామన్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఔషధ పరిశ్రమల్లో దేశంలోనే హైదరాబాద్ ప్రత్యేక స్థానాన్ని నిలుపుకుంటోందని కెటిఆర్ అన్నారు. దేశంలో ఔషధాల ఉత్పత్తిలో 35 నుండి 40 శాతం వరకు హైదరాబాద్‌లోనే ఉత్పత్తి అవుతున్నాయన్నారు. ప్రపంచంలో టీకాల ఉత్పత్తిలోనూ 3వ వంతు వ్యాక్సీన్లు హైదరాబాద్‌లోనే ఉత్పత్తి అవుతున్నాయన్నారు. టిఎస్ ఐపాస్‌లో ఇప్పటికే పలు యూరోపియన్ కంపెనీలు రాష్ట్రాంలో పెట్టుబడులు పెట్టాయని మంత్రి చెప్పారు. వీటిలో ఫెర్రింగ్ ఫార్మాతో పాటు నోవార్టీస్, జిఎస్‌కె, ఖేమో, లోంజా తదితరమైనవి ఉన్నాయన్నారు. జీనోమ్ వ్యాలీ 2.0 ఇప్పటికే లైఫ్ సైన్సెస్ రంగంలో ఔషధ క్లస్టర్‌గా గుర్తింపు తెచ్చుకుందన్నారు. ఔషధ రంగ పరిశ్రమలు అన్నీ అందుబాటులోకి వస్తే లైఫ్ సైన్సెస్ రంగ విద్యార్ధులకు మంచి భవిష్యత్తు, అవకాశాలు దక్కుతాయని కెటిఆర్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఫెర్రింగ్ ఫార్మా ప్రతినిధులతో పాటు టిఎస్‌ఐఐసి విసి అండ్ ఎండి వెంకట నర్సింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Comments

comments